రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సి , ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. అయితే 20 వ తేదీ జరగనున్న ఒకేషనల్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై 11:30 ముగుస్తుంది.
తెలంగాణలో గతంలో 11 పేపర్లు ఉండేవి హింధీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండేసి పేపర్లతో మొత్తం 11 రోజులు పరీక్షలు నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో సిలబస్ ను తగ్గించడంతోపాటు ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్ ఉండేలా నిర్ణయించారు. జనరల్ సైన్స్ పేపర్ మాత్రం భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇస్తారు. ఒక రోజే పరీక్ష ఉంటుంది. సమాధానాలను వేర్వేరు జవాబుపత్రాలపై రాయాలి. ఆ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు వేరుగా ఉండటం వల్ల పేపర్ కరెక్షన్ లో సమస్య ఏర్పడతాయని రెండు ప్రశ్నపత్రాలు ఇస్తున్నారు. ఒక్కో దానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే..!