టీ ఇది చాలామందికి గొప్ప ఔషధం అనే చెప్పాలి. ఉదయం లేవగానే టీ కోసం ఎదురు చూడటం.. అది తీసుకున్న తర్వాత ఎంతో రిలాక్స్ కావడం తెలిసిందే. ఒత్తిడిలో ఉన్నా.. తలనొప్పెడుతున్నా.. స్నేహితులు, బంధువులతో సరదగా టైం స్పెండ్ చేయాలి అన్నా.. సందర్భం ఏదైనా.. ఎక్కడైనా.. కచ్చితంగా టీ ఉండాల్సిందే. ఏది ఏమైనా టీ అంటే నిజంగా అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.
హైదరాబాదీలకు ఎంతో ఇష్టం చాయ్ అంటే. చాయ్ ని ఎంతో ఇష్టపడే వారికి నగరంలో నీలోఫర్ కేఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ నీలోఫర్ కేఫ్ ఎప్పుడో ఒక్కసారి ఖచ్చితంగా వెళ్లి ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో ఈ షాపు యజమాని బాబురావు మాట్లాడుతూ.. తాను నిర్వహిస్తున్న ఈ టీ దుకాణంలో 690 మంది పనిచేస్తున్నారని.. వారికి రోజు భోజనం కి మూడు లక్షలు అవుతుందని అన్నారు. ఇక ఇక్కడ ఇతర పనులు చూసుకునేందుకు ఖర్చులు రోజుకు ఒక రూ.రెండు లక్షల వరకు అవుతాయని ఆయన అన్నారు.
బాబురావు ఈ టీ దుకాణాన్ని మొదలు పెట్టినప్పుడు జనాలకు తాను చేసే టీ బాగా నచ్చాలి.. అప్పుడే తన టీ షాప్ కి ఎవరైనా వస్తారని.. ఆదే ఆలోచించి అందరికీ నచ్చే విధంగా తయారు చేశారు. అంతేకాదు టి తాగిన తర్వాత ఎంతో మంది అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఇష్టంగా టీ తయారు చేయడం మొదలు పెట్టారు.. అప్పటి నుంచి నీలోఫర్ కేఫ్ జనాలు ఇష్టంగా రావడం మొదలు పెట్టారు. ఆ నాటి నుంచి టీ అంటే నీలోఫర్ దుఖానం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.బాబూరావు నడుపుతోన్న ఈ నీలోఫర్ చాయ్ దుకాణం ఎప్పుడు చూసినా కస్టమర్లతోనే రద్దీగా ఉంటుంది. జిఎస్టి నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటే టర్నోవర్ ఎంత ఉంటుందో ఊహించుకోవొచ్చు.
బాబు రావు మనసు కూడా ఎంతో విశాలమైనది.. ఆయన సంపాదనలో ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తుంటారు. ప్రతిరోజూ తన టీ షాప్ లో మిగిలిన ఆహార పదార్థాలు ఆకలితో ఉన్నవారందిరికీ పంచుతుంటారు. గత పాతిక సంవత్సరాల నుంచి తాను ఈ పని చేస్తున్నానని.. మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుందని బాబూ రావు తెలిపారు. బాబూరావు, ఆదిలాబాద్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ కి వచ్చారు. తొలినాళ్లలో ఓ బట్టల దుఖాణంలో పనిచేసిన ఆయన తర్వాత రోజుకు రెండు రూపాయల కోసం ఒక హోటల్లో పనిచేశారు. తన ప్రయాణం కేఫ్ నీలోఫర్లో మొదలైనట్టు చెప్పారు.
కొంతకాలం తర్వాత ఆ కేఫ్ నష్టాల్లోకి వచ్చందని.. అయితే నష్టాలలో ఉన్న నిలోఫర్ కేఫ్ ని కాంట్రాక్టుకు తీసుకుని మంచి లాభాలను సంపాదించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ కేఫ్ కి తానే ఓనర్ అయ్యారు. తాను చదువుకునే రోజుల్లో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డానని.. ఒకదశలో తన చదువు కోసం ఇంట్లో పాడి ఆవుని అమ్మి మరీ చదివించారని కన్నీటిపర్యంతం అయ్యారు. ఏ విషయంలోనూ కృంగిపోకుండా కృషీ, పట్టుదలతో ఏదైనా సాధించవొచ్చని అంటున్నారు బాబురావు. మరి బాబూరావు లాంటి సక్సెస్ ఫుల్ స్టోరీ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.