ఈ కాలంలో అనుబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కొంత మంది మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణంలో డబ్బు కోసం ఇద్దరు అన్నదమ్ములు చేసిన పని చూస్తే ఛీ కొడతారు. ఆస్తి కోసం కన్నతల్లి శవం ముందే అన్నదమ్ములు కొట్టుకున్న దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పోషించి పెద్దవాళ్లను చేసిన తల్లి కళ్లముందే విగతజీవిగా పడి ఉంటే ఆ కొడుకులు మాత్రం ఆస్తి కోసం మృతదేహం ముందే తన్నకుని పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చారు.
ఇది చదవండి : టాలీవుడ్ విషాదం.. సినీ నటుడు మృతి
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మల్లారం యశోద, భూమిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భూమిరెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో పెద్ద కుమారుడు రామకిష్టారెడ్డి, చిన్న కుమారుడు రవీందర్‌రెడ్డిలకు చెరో 20 గుంటల చొప్పున గతంలోనే పంపకాలు చేశారు. మిగిలిన భూమిలో తాను సేద్యం చేస్తున్నాడు. అయితే, మిగిలిన ఆస్తిని కూడా తమకు పంచాలని కుమారులిద్దరూ తండ్రితో గొడవ పడేవారు. చివరికి ఈ గొడవ కుల పెద్దల పంచాయతీకి చేరగా, తల్లిదండ్రులను చివరి వరకు చూసే వారికే మిగిలిన ఆస్తి దక్కుతుందని తీర్పు చెప్పారు. కుమారులిద్దరూ నెలకొకరు చొప్పున తల్లిదండ్రులను చూసుకుంటూ వచ్చారు. గత ఐదు నెలల నుంచి దంపతులిద్దరూ పెద్ద కుమారుడు రామకృష్ణారెడ్డి వద్దనే ఉంటున్నారు.
ఇది చదవండి : ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ క్రమంలో యశోద (92) అనారోగ్యంతో బుధవారం కన్నుమూసింది. తల్లికి ప్రశాంతంగా కర్మకాండ చేయాల్సిన కొడుకులిద్దరూ చితి వద్ద కొట్టుకున్నారు. ఆస్తి తనకు దక్కాలంటే.. తనకే దక్కాలని కలబడ్డారు. తల్లి చితి చుట్టూ తిరిగే విషయంలోనూ ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అంతే కాదు ఇద్దరూ పోటీపడి తలకొరివి పెట్టారు. ఈ సంఘటన చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. ఆస్తి కోసం కన్నతల్లి మృతదేహం వద్దే ఇలాంటి పనిచేయడం ఎంత వరకు న్యాయం.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.