ఒకప్పుడు ఆడ, మగ మధ్య స్నేహం ఉండేది. పవిత్రమైన ప్రేమ ఉండేది. ఈ రెండు బంధాలు దాటి ముందుకి పోతే వైవాహిక జీవితం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. డేటింగ్ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
పిల్లలు తప్పు చేస్తే పెద్దలు శిక్ష విధించి, వారిని మంచి మార్గంలో పెట్టాలి. కానీ.., ఇక్కడ ఓ తల్లి మాత్రం తన కూతురి చేత 100 మందితో డేటింగ్ చేయించి.. అదో ఘనకార్యంలా మురిసిపోతోంది. ఆ తల్లి, కూతుళ్లు ఇలా ఎందుకు చేశారంటే? ఒకప్పుడు ఆడ, మగ మధ్య స్నేహం ఉండేది. పవిత్రమైన ప్రేమ ఉండేది. ఈ రెండు బంధాలు దాటి ముందుకి పోతే వైవాహిక జీవితం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. డేటింగ్ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. కావాల్సినన్ని రోజులు కలిసి ఉండటం, అవసరం తీరాక బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం.
ఈ డేటింగ్ ట్రెండ్‌లో అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఇంకా స్పీడ్ గా ఉండటం మరో ఆశ్చర్యకరమైన విషయం. మాములుగా ఓ అమ్మాయి ఎంత మందితో డేటింగ్ చేస్తుంది? ఇదేమి పిచ్చి ప్రశ్న అనుకోండి. ఈ ప్రశ్న వేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే తాజాగా ఓ అమ్మడు 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ పూర్తి చేసి.. దానికి కేక్ కటింగ్ కూడా చేసి.. నెట్టింట పోస్ట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..బ్రిటన్ కు చెందిన ఓ అమ్మాయి ఏడాదిలో 100 మంది పురుషులతో డేటింగ్ చేసి.. ఇప్పుడు అందరి చేత తిట్లు తింటుంది. ఇక్కడ ఇంకా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఆ యువతికి ఇంత మందితో డేటింగ్ చేయమని ఆ కన్నతల్లే సలహా ఇవ్వడం!
ఇలా 100 మందితో డేట్ ఫినిష్ చేసినందుకు గాను.. ఆ యువతికి కన్నతల్లి 500 డాలర్లు గిఫ్ట్ గా ఇచ్చి కేక్ కట్ చేయించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలియజేస్తూ ఆమె సోదరి ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నతల్లివి అయ్యుండి.. కూతురికి ఇలాంటి సలహా ఎలా ఇచ్చావని ప్రశ్నించగా ఆమె కాస్త విచిత్రమైన సమాధానం ఇవ్వడం విశేషం. ‘పెళ్లి అయ్యాక నా కూతురికి మగాడంటే భయం ఉండకూడదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అందుకోసం ఈ డేటింగ్ ఉపయోగపడుతుంది. నా కూతురు ఎంజాయ్ చేస్తా అంటే.. ఇంకా డబ్బులు ఇస్తాను’ అని తల్లి సమాధానం ఇవ్వడం విశేషం. మరి.. ఒక్కొక్కరితో మూడురోజుల పాటు.. డేటింగ్ చేసి, సంవత్సరం అంతా శోభనం జరుపుకున్న ఈ కూతురిపై, అందుకు సహకరించిన ఆ తల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.