ఉన్నత చదువులు చదివి ఓ మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారు యువతీ యువకులు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తుంటారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా అంకితభావంతో చదివి లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు.
ఉన్నత చదువులు చదివి ఓ మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారు యువతీ యువకులు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తుంటారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా అంకితభావంతో చదివి లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు. కొందరు ప్రైవేట్ రంగంలోకి వెళితే మరికొందరు ప్రభుత్వరంగంలో స్థిరపడేందుకు ఇష్టపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోస్టులు తక్కువ ఉన్నప్పటికి లక్షల మంది పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు పోటీ పడిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఉద్యోగాలను సాధించారు. ఆ వివరాలు మీకోసం..
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంత సులువైన పని కాదు. ఇలాంటి తరుణంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్రూప్ 1 ఫలితాల్లో మెరిసారు. నిన్న ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించగా పి.వెంకట సాయిరాజేష్ అగ్నిమాపక అధికారిగా, పి.వెంకట సాయిమనోజ్ వైద్యారోగ్యశాఖలో పరిపాలనాధికారిగా ఉద్యోగాలు సాధించారు. వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి సివిల్స్ కు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1కు పోటీపడి సత్తాచాటారు. వీరి తండ్రి పోలుమహంతి ఉమామహేశ్వరరావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరయ్యారు. తల్లి సాయి సుజాత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.