ఇంట్లో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి ఓ ఎస్సై బ్రెయిన్ డెడ్ తో ప్రాణాలు విడాచారు. కానీ, ఆయన చనిపోయి కూడా మరో ఐదుగురికి ప్రాణం పోశారు. ఈ నిర్ణయంతో పలువురు ఆయను సెల్యూట్ చేస్తున్నారు.
మనిషి జీవితం అనేది ఎంతో విలువైనది. ఈ జీవితాన్ని బతికినన్ని రోజులు ఎంతో సంతోషంగా, ఉన్నతంగా జీవించాని ప్రతీ ఒక్కరూ కోరుకుంటుంటారు. కానీ, అనుకోకుండా జరిగే కొన్ని ప్రమదాల కారణంగా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. కొంతమంది కిడ్నీలు, లీవర్ డ్యామేజ్ వంటి సమస్యలతో బాధపడుతూ బతకలేక చచ్చిపోతుంటారు. అలాంటి వారికి కొందరు మంచి తనం కలిగిన వ్యక్తులు చనిపోయి అవయవదానం చేస్తూ చివరికి కొందరి ప్రాణాలు నిలబెడుతుంటారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ పోలీస్ ఆఫీసర్.. తాను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణం పోశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో సుభాష్ చందర్ అనే వ్యక్తి (59) స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇతను ఇటీవల ఇంట్లో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే బ్రెయిన్ డెడ్ తో చనిపోయడాని నిర్ధారించారు. ఈ వార్తతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదిలా ఉంటే.. సుభాష్ చందర్ గతంలోనే అవయవదానం చేసేందుకు ముందుకొచ్చి జీవన్ ధాన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇదే విషయాన్ని సుభాష్ చందర్ కుటుంబ సభ్యులు జీవన్ ధాన్ టస్ట్ సంస్థ సభ్యులకు చేరవేశారు. వెంటనే వచ్చిన ఆ సంస్థ వైద్యులు.. మృతుడు సభాష్ చందర్ నుంచి కిడ్నీ, లీవర్ వంటి అవయవాలు తీసుకున్నారు. ఇక మరుసటి రోజు అతని కుటుంబ సభ్యులు సంగారెడ్డిలో అంత్యక్రియలు నిర్వహించారు.
అతడి మరణ వార్త తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి సుభాష్ చందర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సుభాష్ చందర్ మంచి మానవతావాది అంటూ ఆయన సేవలు కొనియాడారు. అంతేకాకుండా చనిపోయి కూడా ఐదుగురికి ప్రాణం పోసిన ఆయన చాలా గ్రేట్ అంటూ అన్నారు. అయితే చనిపోయి ఐదుగురికి ప్రాణం పోసిన సుభాష్ రెడ్డి నిర్ణయంపై స్థానికులు సెల్యూట్ చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.