SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Nitin Gadkari Tweet About Iconic Cable Cum Suspension Bridge Across Krishna River Between Ap And Telangana

Cable Bridge: దేశంలోనే తొలిసారి.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేబుల్‌ బ్రిడ్జి!

  • Written By: Dharani
  • Published Date - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cable Bridge: దేశంలోనే తొలిసారి.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేబుల్‌ బ్రిడ్జి!

ఏపీ, తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండు రాష్ట్రాలను కలుపుతూ.. ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం చేపటనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రోడు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశాడు. అంతేకాక ఐకానిక్‌ బ్రిడ్జి ఎలా ఉండనుందో ఫోటోలను కూడా షేర్‌ చేశాడు గడ్కరీ. 1082.56 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించే ఈ బ్రిడ్జిని 30 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలో ఈ తరహా కేబుల్‌ బ్రిడ్జి ఇదే మొదటిది కావడం విశేషం. అంతేకాక ఇది ప్రపంచంలోనే రెండో చారిత్రాత్మక వంతెనగా నిలవనుంది అన్నారు నితిన్‌ గడ్కరీ.

ఇక ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకల కోసం రహదారితో పాటు.. పాదచారుల కోసం గాజు నడక మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్రిడ్జి కింది భాగంలో ఈ వాక్‌వేను నిర్మిస్తారు. గ్లాస్ వాక్‌వేలో నడుస్తుంటే.. కింద కృష్ణమ్మ అందాలను ఆస్వాదించే విధంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ ఐకానిక్ బ్రిడ్జి మీద.. పాదచారులు కోసం పొడవైన గాజు మార్గం, పైలాన్‌, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషనల్ స్పాన్ వంటి అనేక ప్రత్యేకతలు కలిగి ఉండనుంది. బ్రిడ్జి చుట్టూ.. నల్లమల అడవులు, ఎత్తైన పర్వతాలు, విశాలమైన శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్ వాటర్‌తో ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంది.

అలానే ఈ బ్రిడ్జికి తెలంగాణ రాష్ట్రం వైపున లలిత సోమేశ్వర స్వామి ఆలయం ఉండనుండగా.. ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వరం ఆలయం ఉంటాయి. ఇరువైపున ఆలయాలు, ఐకానిక్ బ్రిడ్జి అందాలు, కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ.. పచ్చటి ప్రకృతిని ఆస్వాదించే ప్రత్యేకతలు ఉన్నందున.. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి పర్యాటకంగా డిమాండ్‌ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే.. ఇరు రాష్ట్రాల ప్రజలకు ఎంతో లాభం కలగనుంది. ఈ వంతెన వినియోగంలోకి వస్తే.. ప్రయాణ ఇక్కట్లు తప్పుతాయి అంటున్నారు పరిసర ప్రాంత ప్రజలు. ప్రస్తుతం తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే కృష్ణా నదే దిక్కు. అది కూడా పడవలోనే ప్రయాణించాలి. అలా కాదనుకుంటే.. రోడ్డుమార్గంలో రాకపోకలు సాగించాలంటే సుమారు 100 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాలి.

ఈ క్రమంలో బ్రిడ్జి పూర్తైతే.. ఈ కష్టాలు తప్పుతాయి అంటున్నారు జనాలు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. బ్రిడ్జి మీది నుంచి నేరుగా వెళ్లిపోవచ్చు. దీనివల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుంది అని భావిస్తున్నారు. పర్యాటకంగా మాత్రమే కాక.. రెండు రాష్ట్రాల ప్రజలకు దూరభారం తగ్గించే ప్రయోజనం ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Bringing Prosperity Through World Class Infrastructure in New India

Iconic cable-stayed cum suspension bridge across Krishna river in Andhra Pradesh and Telangana has been approved at total cost of Rs 1082.56 Cr with the construction period of 30 months. #PragatiKaHighway pic.twitter.com/elKeMRhL4m

— Nitin Gadkari (@nitin_gadkari) October 13, 2022

  • ఇది కూడా చదవండి: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన యువతి.. కారణం?
  • ఇది కూడా చదవండి: విశాఖ రాజధాని కోసం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ యువకుడు..

Tags :

  • Andhra Pradesh
  • Cable Bridge
  • krishna river
  • Nitin Gadkari
  • Telangana
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam