మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే.. వాటిని ఆచరిస్తే.. బాబాలను, మాతాజీలను ఆశ్రయించి.. వారి సేవలు చేయడం ఎంత వరకు సమంజసం.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి తెలంగాణ హైల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకి. ఇలాంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి.. ఓ మాతాజీని ఆశ్రయించి.. ఆమె చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అవి క్షుద్ర పూజలు కాదని డీహెచ్ ఖండించినా వ్యవహారం సద్దుమణిగేలా లేదు.
ఇది కూడా చదవండి: DH శ్రీనివాస్ విచిత్ర పూజలు! వీడియో వైరల్…
ఇక డీహెచ్ చేత పూజలు చేయించిన మాతాజీ గురించి నివ్వెర పోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. భద్రాద్రి జిల్లా సుజాత నగర్ ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి.. కొన్ని రోజుల క్రితం మాతాజీగా మారింది. స్వయం ప్రకటిత దేవతగా అవతారమెత్తినట్లు.. స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి రకారకాల పూజలు నిర్వహిస్తూ అమాయక జనాలను బుట్టలో వేసుకున్నారట. ఈ క్రమంలో సదరు మాతాజీ గతంలో ముక్కలా.. ముక్కబులా పాటకు మాస్ స్టేప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఆమె దేవతగా మారడం ఏంటో.. ఇలాంటి మాతాజీ దగ్గర రాష్ట హెల్త్ డైరెక్టర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగి.. వంగి వంగి దండాలు పెట్టడం.. ఆమె చెప్పినట్లు పూజలు చేయడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Rajasekhar (@Rajasek61450452) April 7, 2022
ఇది కూడా చదవండి: తప్పతాగి.. పెళ్లి చేసుకున్న మగాళ్లు.. మత్తు దిగాక అదిరే ట్విస్ట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.