తెలంగాణలో తాజాగా ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
గత కొన్ని రోజుల నుంచి చాలామంది గుండెపోటుతో పిట్టల్లా రాలుతున్నారు. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.., ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇలా రోజుకి ఎంతో మంది హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి షటీల్ ఆడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. వెంటనే స్పందించిన తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
తెలంగాణ జగిత్యాల క్లబ్ లో బూస వెంకటరాజా గంగారం (53) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు తాజాగా తోటి స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా షటిల్ ఆడాడు. ఇక ఆడుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఇదంతా అక్కడే ఉన్నకొందరు వ్యక్తులు తీసిన వీడియోలో రికార్డ్ అయింది. ఇక వెంటనే స్పందించిన తోటి స్నేహితులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఎలా కుప్పకూలాడో చూడండి! pic.twitter.com/8r15ovmTLU
— venky bandaru (@venkybandaru13) June 2, 2023