పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. మంచిదే.. కానీ కొందరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పేరుతో సామాన్యులను వేధిస్తున్న ఘటనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నా.., పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది సామాన్య పౌరులు ఆరోపిస్తున్నారు. చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని గతంలో ఓ వ్యక్తి తన బైక్ ని నడిరోడ్డుపై తగల పెట్టాడు.
తాజాగా ఓ వ్యక్తి తనను పోలీసులు వేధించారని వారిపై ఎదురుతిరిగిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో కలసి బైక్ పై కూరగాయాల మార్కెట్ వెళ్లాడు. అయితే.. అక్కడ ఉన్న పోలీసు వారిని ఆపి, హెల్మెంట్ ఎందుకు పెట్టుకోలేదని ఆగ్రహిస్తూ.. బైక్ తాళం తీసుకున్నాడు. తాను హెల్మెంట్ పెట్టుకున్నా ఎందుకు ఆపారంటూ శ్రీనివాస్ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్న ఎస్సై కోపంగా శ్రీనివాస్ పై చేయిచేసుకున్నాడు.
తాను ఏ తప్పు చేయలేదని హెల్మెంట్ ధరించినా.. ధరించలేదని తనపై ఎస్సై చేయిచేసుకున్నాడని శ్రీనివాస్ ఆరోపించాడు. “సరే..వారు అన్నట్లుగానే నేను హెల్మెంట్ ధరించకపోతే జరిమానా విధించాలి..కానీ కొట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు” ఆ వ్యక్తి. అన్యాయంగా పోలీసులు తనను కొట్టారని నిరసిస్తూ శ్రీనివాస్ రోడ్డుపై బెఠాయించాడు. ట్రాఫిక్ రూల్స్ పరంగా తప్పు చేస్తే ఫైన్ విధించాలే గాని, కొట్టే అధికారం మీకు ఎక్కడిది అంటూ శ్రీనివాస్ పోలీసులను ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అక్కడ జరుగుతున్న సంఘటన చూసి శ్రీనివాస్ కూతురు భయంతో వణికిపోయింది. తండ్రిని పట్టుకొని ఏడ్చింది. “మనం తప్పు చేయలేదు తల్లి.. నువ్వు ఏడవకు” అంటూ శ్రీనివాస్ పాపను ఓదార్చాడు. స్థానికులు కూడా శ్రీనివాస్‌కు మద్దతు నిలిచారు. మరోవైపు తన తండ్రి హెల్మెంట్ ధరించినా.. ధరించలేదని పోలీసులు బైక్ తాళం తీసుకున్నారని అతని కుమార్తె ఏడుస్తూ చెప్పింది. ఇక విషయం పెద్దదిగా మారుతుందని గ్రహించిన పోలీసులు ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇన్ ఛార్జ్ స్పందిస్తూ.. ఎస్‌ఐ మునీరుల్లాను సదరు వ్యక్తే దూషించాడని తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
POLICE STATE?#Mahabubnagar police conducting a drive to ensure people are wearing masks/helmets &following rules. They stopped this man who was apparently going for vegetables& slapped him. The man says you can fine me but who gives a right to slap me in front of my child? pic.twitter.com/UpnQPEjk5M
— Revathi (@revathitweets) December 6, 2021