ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన పోలీసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
యువత బాగా ఇష్టపడే ఉద్యోగాల్లో పోలీసు కొలువు ఒకటి. యూనిఫామ్ వేసుకొని సమాజం కోసం సేవ చేయాలని ఎంతో మంది యూత్ కలలు కంటుంటారు. ఉద్యోగంలో భాగంగా ప్రాణాలు వదిలిన వీర పోలీసులను స్ఫూర్తిగా తీసుకుంటారు. నోటిఫికేషన్ పడగానే రాత్రింబవళ్లు శ్రమించి జాబ్ కొట్టేందుకు ప్రాణం పెట్టేస్తారు. పోలీసులకు సొసైటీలో ఉండే గౌరవమర్యాదల గురించి తెలిసిందే. అలాంటి పోలీసులు ఎంతో ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. దొంగల్ని పట్టుకోవాలంటే వారి కంటే పోలీసులు చురుగ్గా, బలంగా ఉండాలి. కొంతమంది పోలీసులు ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది పోలీసులు మాత్రం అంత ఫిట్‌గా కనిపించరు. వృత్తిపరమైన ఒత్తిళ్లు, పనిభారం, విశ్రాంతి తీసుకోకపోవడం మొదలైనవి దీనికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పోలీసులకు ఫిట్నెస్ తప్పనిసరి చేశాయి. కానిస్టేబుల్, ఎస్ఐ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాల్సిందేనని రూల్ తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పొట్ట ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లను మల్లారెడ్డి కోరారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఫిట్నెస్ పెంచుకోవడం కోసం పోలీసు స్టేషన్లలోనే జిమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ నంబర్ వన్ ప్లేసులో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని మెచ్చుకున్నారు. పోలీసులు ఫిట్‌గా మారాలని.. వారిని చూస్తే దొంగలు భయపడాలన్నారు మల్లారెడ్డి. మరి.. పోలీసుల ఫిట్నెస్ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.