నగరంలో కేంద్ర జిఎస్టీ అధికారుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. ఓ గోదాంను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది.
హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. జిఎస్ టి అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఫేక్ జిఎస్ టి నంబర్ తో ట్యాక్స్ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న స్క్రాప్ గోదాం నిర్వాహకులను పట్టుకునేందుకు వెళ్లిన అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో జిఎస్టీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు రెస్క్యూ చేపట్టారు. కిడ్నాప్ కు పాల్పడిన నలుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో కేంద్ర జిఎస్టీ అధికారుల కిడ్నాప్ ఘటన నగరంలో సంచలనంగా మారింది. అసలేం జరిగింది? ఎందుకు జిఎస్టీ అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు? అనే విషయాలు మీకోసం..
మన దేశంలో పలు రకాల పన్నులను విలీనం చేసి జిఎస్టీని అమల్లోకి తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పలు రకాల పన్నుల స్థానంలో జిఎస్టీ విధిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి జిఎస్టీని అమల్లోకి తీసుకు వచ్చారు. అయితే కొంత మంది ఫేక్ జిఎస్టీ నెంబర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారు. ఇదే రీతిలో ఓ స్క్రాప్ గోదాం నిర్వాహకులు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. వీరిని పట్టుకునేందుకు వెళ్లిన అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. దిల్ సుఖ్ నగర్ లోని కృష్ణా నగర్ లో ఓ స్క్రాప్ గోదాం నిర్వాహకులు ఫేక్ జిఎస్టీ నెంబర్ తో ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. సమాచారం అందుకున్న జిఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్ గోదాంను సీజ్ చేసేందుకు వెళ్లారు. అంతలోనే గోదాం నిర్వాహకుడు, మరో ముగ్గురితో కలిసి కారులో వచ్చి జిఎస్టీ అధికారులను కిడ్నాప్ చేశారు. అనంతరం అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజీల ఆదారంగా నిందితులను పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.