సాధారణంగా హెలికాప్టర్లు.. చాపర్లు వంటి వాటిని సినీ, సెలబ్రిటీలు వాడుతుంటారు. వ్యాపారవేత్తలు కూడా కొనుగోలు చేస్తారు. కాకపోతే.. వారికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రావు. ఘీ క్రమంలో తాజాగా కరీంనగర్ వాసి ఒకరు హెలికాప్టర్ కొనుగోలు చేయడం.. ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు వ్యక్తి.. కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు.. యాదగిరిగుట్టకు తీసుకు వచ్చాడు. ఇక యాదాద్రిలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌కు పూజలు నిర్వహించడం ఇదే ప్రథమం. దాంతో జనాలు పెద్ద ఎత్తున దీన్ని చూసేందుకు తరలి వచ్చారు. ఆ వివరాలు..
కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రతిమా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బోయిన్‌పల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం దానికి యాదాద్రిలో పూజలు నిర్వహించారు. పెద్దగుట్ట (ఆలయ నగరి)పై పూజారులు చాపర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త బోయిన్ పల్లి శ్రీనివాసరావుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పూజ అనంతరం శ్రీనివాస్‌రావు హెలికాప్టర్‌ను ఆన్ చేశారు. తర్వాత కాసేపు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ దృశ్యాలను చూడటానికి యాదాద్రికి వచ్చిన భక్తులే కాక.. చుట్టూపక్కల వారు భారీగా తరలి వచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.