ఈమధ్యకాలంలో అందరినీ భయపెడుతున్న పదం 'హార్ట్ అటాక్'. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే తేడా లేదు.. వయసుతో సంబంధమే లేకుండా అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. అప్పటివరకు అందరితో ఉల్లాసంగా గడిపిన యువకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించాడు అంటే.. వయస్సు పైబడ్డ వారుంటారులే అనుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయాయి. వయసుతో సంబంధం లేదు.. అందునా ఎలాంటి అనారోగ్యాలు లేని వారు సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈమధ్యకాలంలో అందరినీ భయపెడుతున్న పదం ‘హార్ట్ అటాక్’. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే తేడా లేదు.. వయసుతో సంబంధమే లేకుండా అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. అప్పటివరకు అందరితో ఉల్లాసంగా గడిపిన యువకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించాడు అంటే.. వయస్సు పైబడ్డ వారుంటారులే అనుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయాయి. వయసుతో సంబంధం లేదు.. అందునా ఎలాంటి అనారోగ్యాలు లేని వారు సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజగా, మరో యువకుడు కార్డియాక్ అరెస్టుతో దూరపు దేశంలో ప్రాణాలు వదిలాడు.
ఉన్నత చదువుల కోసం నుంచి అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు బొడగల వంశీరెడ్డయ్య(24) కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసిన యువకుడు.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. వంశీరెడ్డయ్య తండ్రి బొడగల లవకుమార్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. కొడుకును బాగా చదివించాలనుకున్న ఆ తండ్రి పైచదువులు కోసం విదేశాలకు పంపాడు. వంశీ న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. గురువారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయిన అతడు.. మరునాడు ఉదయం నిద్ర లేవలేదు. దీంతో ఉదయాన్నే స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే పోలీసులు అక్కడకి అతన్ని పరిశీలించగా, అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వంశీ స్నేహితులు అతడి కుటుంబానికి తెలియజేశారు. దీంతో వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రయోజకుడై వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మృతదేహం బుధవారం నగరానికి చేరుకోవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.