నిత్యం అక్కడక్కడ డ్వాక్రా రుణాల్లో వెలుగు సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చే బ్యాంక్ రుణాలు, నెలవారి కంతుల్లో అవకతవకలకు పాల్పడుతుంటారు. తాజాగా 34 మహిళ సంఘాల గ్రూపుల్లో భారీ మోసం వెలుగు చూసింది. అధికారుల పరిశీలనలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయామని డ్వాక్రా గ్రూపు మహిళలు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే..
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నందిగామలో నాలుగేళ్ల క్రితం 34 మహిళ సంఘాలు రూ.1.12 కోట్లు బ్యాంకు ద్వారా రుణం పొందారు. తీసుకున్న రుణాలకు మహిళలు క్రమం తప్పకుండా కిస్తీలు అదే గ్రామంలో ఉండే వీవోఏ ప్రవీణకు కట్టారు. ఆమె బ్యాంకులకు వెళ్లి లోన్ ను కట్టేసేది. అయితే మహిళలు ఈఏంఐలు కట్టేశాం కదా. మరోసారి లోన్ కోసం మహిళలు నాలుగేళ్ల తరువాత బ్యాంకుకి వెళ్లారు. అక్కడి వెళ్లిన వారికి బ్యాంకు వాళ్లు చెప్పిన మాటలకు షాక్ అయ్యారు. మీరు గతంలో తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో మహిళలు తాము మొత్తం లోన్ తీర్చామని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు కూడా మహిళలు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు.ప్రవీణా నుంచే డబ్బులు రికవరి చేసి మహిళలుకు ఇస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. మహిళ సంఘాల గ్రూపులకు సంబంధించిన కోటి రూపాయాలను బ్యాంకు సిబ్బంది స్వాహ చేశారని అధికారుల విచారణలో తెలింది.అయితే ప్రవీణానే తీసుకుని తమకు నకిలీ రశీదులు ఇచ్చినట్లు మహిళలు తెలిపారు. మరోపక్క మహిళలు కూడా తమ వాదనను వినిపిస్తున్నారు.అయితే నాలుగేళ్లుగా లోన్ కట్టకపోతే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రవీణ, బ్యాంకులోని కొందరితో కలసి డబ్బులు కాజేసిందని మహిళలు ఆరోపిస్తున్నారు.
అయితే ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రవీణా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. డబ్బులు కాజేసింది వాస్తవమేనని, అందరి భాగస్వామ్యం ఉందని జిల్లా కలెకర్ట్ కి ఫిర్యాదు చేసింది, తన దగ్గర దశల వారిగా కొందరు డబ్బులు తీసుకున్నారని, అవి తిరిగి చెల్లించడంలేదని తెలిపింది. ఏమైన అయితే మేము చూసుకుంటాములే అని తెలిపినట్లు ప్రవీణా ఆరోపిస్తుంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.