ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను అందించింది. ఆ రోజున సున్నా వడ్డీ నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల వారిని అభివృద్ధిపథంలో నడిపించడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు తీసుకున్న లోన్లపై వడ్డీ భారం తప్పించేందుకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సాయంతో మహిళలు స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. కాగా నాలుగో విడత సున్నా వడ్డీ పథకం నిధులను ఆ రోజున విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డ్వాక్రా గ్రూప్ మహిళలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లోన్ లకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 11న అందజేస్తామని ప్రభుత్వ ప్రకటించింది. డ్వాక్రా గ్రూప్ లోని మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే వారికి ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించారు. కాగా ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూప్ లోని మహిళలకు రూ. 1358.78 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమచేయనున్నారు.