కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌కు తరచూ రాకపోకలు సాగించే ఓ ట్రైన్ రద్దయ్యింది. రైల్వే శాఖ మార్పులకు తగ్గట్లుగా ప్రయాణికులు తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందే.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లే ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు (రైలు నంబర్లు: 17251/17252) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 10 రోజుల పాటు ఈ ట్రైన్‌ను రద్దు చేస్తున్నామని తెలిపింది. ప్రయాణికులు దీన్ని గమనించాలని కోరింది. బేతంచర్ల-రంగాపురం-మల్కాపురం స్టేషన్ల మధ్య రెండో లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే పనులు చేపట్టారు. అందుకే ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయ కలుగుతోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. గుంటూరు-కాచిగూడ ట్రైన్ ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు.. అలాగే కాచిగూడ-గుంటూరు రైలు 9వ నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి.
గంగినేని-ఎర్రుపాలెం స్టేషన్ల మధ్య ట్రాక్ పనులు ఉండటంతో పలు రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మూడు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నామని చెప్పారు. డోర్నకల్-విజయవాడ, విజయవాడ-గుంటూరు, విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ రైళ్లను ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్యాసింజర్లు ఈ మార్పులకు తగ్గట్లుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ మీరు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ జర్నీ ప్లాన్‌ను రైల్వే శాఖ చెప్పినట్లు మార్చుకోండి.