సమాజంలో కొందరు పోలీసులు చేసే సేవలను చూస్తే.. పోలీస్ వ్యవస్థ పైనే మరింత గౌరవం పెరుగుతుంది. కానీ అలా డ్యూటీతో పాటుగా జనాలకు స్వచ్చంద సేవలు చేసే పోలీసులు అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవల ఓ వికలాంగుడి అవస్థను చూసి చలించిన పోలీస్.. వెంటనే స్పందించి ఆ వికలాంగుడికి సహాయం అందించారు. ఈ ఘటన సిటీలోని షేక్ పేట్ నాలా వద్ద జరిగింది. గోల్కొండ పరిధిలోని స్టాఫ్ పోలీస్ సయ్యద్ అజ్మత్ అలీ.. షేక్ పేట్ వద్ద బస్సు ఆపి ఎక్కడానికి అవస్థ పడుతున్న ఓ వికలాంగుడిని గమనించారు. వెంటనే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకొని.. ఆ వ్యక్తి వెళ్లవలసిన బస్సును ఆపి లోపలికి ఎక్కించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆ పోలీసును అభినందిస్తున్నారు. మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.