హన్మకొండ జిల్లా ఉప్పల్‌లో కల్యాణ మండపంలో పెళ్లి ఆగిపోయిన సంఘటన జరిగింది. ఓ యువతిని ప్రేమించి గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ మధ్యకాలంలో ప్రేమించుకోవడం చాలా మామూలు విషయం అయ్యింది. యువతీయువకులు ప్రేమించుకున్నంత ఈజీగా జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఏవో కొన్ని కారణాల వల్ల పెళ్లి కాకముందే తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నారు. కొందరు పెళ్లి అయిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేక విడిపోతున్నారు. మోసం చేయడం అనేది నేటి యువతకు వెన్నతో పెట్టిన విద్య. ఆడ,మగ తేడాలేకుండా ప్రతి వ్యక్తిని ప్రేమలో పడేసి.. తర్వాత ఇష్టం వచ్చినట్లు వేరే వారితో చనువుగా తిరగడం మామూలైపోయింది. సమాజంలో అందరు మంచి, చెడు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. జీవితాలను వారే చేతులారా పాడుచేసుకుంటున్నారు.
గతంలో మోసంపోయిన వారు దిగులుతో క్రుంగి, క్రుషించిపోయేవారు. కానీ ఇప్పుడు మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి కోవకు చెందిన యువతి గురించి మనం మాట్లాడుకుందాం. ఓ యువకుడు ప్రేమించి గర్భవతిని చేశాడు. తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకుని ఆ యువతిని శారీరకంగా అనుభవించాడు. తర్వాత కుటుంబసభ్యులతో కలిసి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులతో వచ్చి పెళ్లిని ఆపేసింది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బొందపల్లికి చెందిన సాయికి ఒక చెల్లెలు ఉంది. తన చెల్లెలి స్నేహితురాలు తరచు ఇంటికి వస్తుండేది. ఆ యువతి స్వగ్రామం చింతమానేపల్లి. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్త ప్రేమగా మారి రెండేళ్లు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. తర్వాత ఆ యువతి గర్భవతి అయ్యింది. పెళ్లి తర్వాత పిల్లల్నికందామని అబార్షన్ చేయించాడు సాయి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా దాటవేస్తున్నాడు. కొద్దిరోజుల తర్వాత తన రూముకు తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా తాళి కట్టాడు. కొంత కాలం కాపురం ఆమెను చేసి శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత తన స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. చాలా రోజులు కనిపించకుండా పోయాడు. సాయి వారి పేరెంట్స్ అతనికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో బుధవారం ముహూర్తం ఖరారైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపానికి బంధువులు, స్నేహితులు అందరు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న యువతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, కల్యాణ మండపానికి చేరుకున్నారు. మండపంలో సాయి కూర్చుని ఉన్నాడు. తాళి కట్టే సమయానికి సాయి ప్రియురాలు పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు సాయిని విచారించారు. సాయి కుటుంబసభ్యులకు, బంధువులకు బాధితురాలికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. అభం, శుభం తెలియని మరో అమ్మాయిని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన సాయికి గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. తర్వాత సాయిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మీ కామెంట్స్ తెలియజేయండి.