భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడలేకపోతున్న భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. మహా విశిష్టత కలిగిన రాములవారి కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చిచ్చే ప్రయత్నానికి శ్రీకర్మ చుట్టింది. కేవలం రూ. 116 చెల్లిస్తే తలంబ్రాలను ఆర్‌టీసీ సిబ్బంది మీ ఇంటి వద్దకెర్ డెలివరీ చేస్తారు. ఈ సేవల మరిన్ని వివరాలకై కింద చదవండి.
శ్రీరామనవమి సందర్భంగా రాములవారి భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. భద్రాద్రి సీతారాముల ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని బస్ భవన్ లో కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాలు కావలసినవారు ఆర్‌టీసీ కార్గో పార్సిల్ కేంద్రాలలో రూ. 116 చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
భద్రాద్రిలో కొలువైన రామయ్య-సీతాదేవిల కళ్యాణాన్ని కనులారా చూడాలని ఎంతోమంది భక్తులు ఆశపడతారు. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలుగా ఎన్నో ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు. అంతటి విశిష్టమైన ఆ కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవాలని భక్తులందరూ పరితపిస్తారు. కానీ అందరికీ ఆ అవకాశం సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారింట ఆనందాన్ని పంచడానికి ఆర్‌టీసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం తలంబ్రాలు కావాల్సిన రూ.116 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవల ప్రారంభోత్సవ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ‘గతేడాది దాదాపుగా 89 వేల మందికి ఈ విధంగానే తలంబ్రాలు అందించాం. భద్రాద్రికి వెళ్లి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించలేకపోయిన భక్తులకు, రాములవారి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునేవారికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఈ సదుపాయాన్ని భక్తులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి..’ అని తెలిపారు. ఈ సేవల మరిన్ని వివరాలకై టీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేయనుంది. భక్తులు కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. pic.twitter.com/ECLHhaGQml
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 15, 2023
With a view to reaching out to the devotees of Lord Shri Rama in far flung areas of Telangana, the #TSRTC has taken up pious task to deliver Bhadrachalam Sri Sitarama Kalyanam Talambralu to their doorstep. pic.twitter.com/C1NXo2c5QI
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 15, 2023