తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు ఆకర్షితులను గావించేందకు మరిన్ని సదుపాయాలను కల్పిస్తుంది. తాజాగా సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్సులో.. టికెట్ తీసుకున్నప్పటి నుండి 3 గంటల పాటు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా సిటీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి తమ గమ్యస్థానాలకు చేరేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంగళవారం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. పుష్పక్ బస్సు ఎక్కిన వారు సిటీలో ఎక్కడైనా సరే ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయాన్ని కల్పించింది. పుష్పక్ బస్సులో టికెట్ తీసుకున్నప్పటి నుండి 3 గంటల పాటు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
దీనికి ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి పుష్పక్ బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్యాసెంజర్స్ తమ గమ్యాన్ని చేరుకోవాలంటే వేరే వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. అందువల్ల నగరంలో సిటీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించామని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టు స్టాపులో టికెట్ తీసుకున్నవారికే ఈ సదుపాయం వర్తిస్తుందని.. మధ్యలో బస్సు ఎక్కినవారికి ఈ సదుపాయం వర్తించదని అధికారులు వెల్లడించారు. మరో విధంగా చెప్పాలంటే ఎయిర్ పోర్టు బస్సులలో ప్రయాణించేవారు మూడు గంటలపాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. వరుస సెలవుల కారణంగా సుదూర ప్రయాణాలు చేసేవారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, విశాఖపట్నం, షిర్డీ, కాకినాడ, తదితర ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.in లో టెకెట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కొరకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.