తెలంగాణలోని ఓ జిల్లాలో తాజాగా కుక్కల పోటీ జరిగింది. ఈ పోటీకి ఎన్నో రకాలు కుక్కలు పాల్గొన్నాయి. ఇదే కాకుండా ఈ పోటీలో గెలుపొందిన కుక్కల యజమానులకు బహుమతులు కూడా అందించారు. ఈ పోటీ ఎక్కడ జరిగిందంటే?
మనం ఇప్పటి వరకు కోడి పందాలు, గుర్రాల పందాలు, ఎడ్ల పందాలు విని ఉంటాం. కానీ, కుక్కల పందాల గురించి ఎప్పడైనా విన్నారా? కుక్కల పందాలు ఏంటనే ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు విన్నది నిజమే. తాజాగా తెలంగాణలో కుక్కల పందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో ఎన్నో రకాల కుక్కలు పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలు ఈ కుక్కల పోటీ ఎక్కడ జరిగింది? అసలేంటి కథా అనే పూర్తి వివరాలు మీ కోసం.
మనం చాలా వరకు కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుర్రపు పందాలు విన్నాం. కానీ, తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు కుక్కల పందాలు నిర్వహించారు. విషయం ఏంటంటే? ఇటీవల జిల్లాలోని అయిజ మండలంలోని వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ అధికారులు కుక్కల పందాలు నిర్వహించారు. ఇక ఈ కుక్కల పోటీలో మూడు రాష్ట్రాలకు చెందిన కుక్కల యజమానులు పాల్గొన్నారు.
అయితే దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముధోల కుక్కలు సైతం ఈ పోటీలో పాల్గొనడం విశేషం. ఈ కుక్కల పరుగు పెందెంలో భాగంగా.. ఆ కుక్కల ముందు రిమోట్ కంట్రోల్ తో కూడిన ఓ బొమ్మ ఉంచుతారు. ఆ బొమ్మను లాగడంతో ఆ కుక్కలు ఆ బొమ్మ వెంటే వేగంగా పరుగెత్తాలి. ఇలా ఈ పోటీలో చాలా రకాల కుక్కలు పాల్గొన్నాయి. కానీ, చివరికి లాల్య అనే వ్యక్తి ముధోల్ కుక్క వేగంగా పరుగెత్తి మొదటి బహుమతి (రూ.15 వేలు) గెలుచుకుంది.
ఇక రెండవ బహుమతి మాత్రం సుల్తాన్ యజమాని అనే వ్యక్తి కుక్క రెండవ బహుమతి ( రూ.10 వేలు) గెలుచుకుంది. ఇక చివరగా తేజ అనే వ్యక్తి కుక్క మూడవ బహుమతి (రూ.8 వేలు) గెలుచుకుంది. అయితే ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కుక్కల పోటీని చూడటానికి స్థానిక ప్రజలు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాజాగా ఇదే అంశం తీవ్రచర్చనీయాంశమవుతుంది. ఈ కుక్కల పోటీ నిర్వాహణపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.