'నువ్ ముగ్గురికి సాయం చెయ్.. వారిని తలా ముగ్గురికి హెల్ప్ చేయమను.." మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాలో ఉన్న ఈ కాన్సెప్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉన్న అందులో ఉన్న ఈ ఐడియా అప్పట్లో కొత్తగా అనిపించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుచుకుంటే.. సమాజంలో అన్యాయమే జరగదని, తోటివారికి సహాయపడటానికి ఇదొక మంచి ప్రయత్నమని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగపోగా..
మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉన్న అందులో ఉన్న ఒక కాన్సెప్ట్ కు మాత్రం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ‘నువ్ ముగ్గురికి సాయం చెయ్.. వారిని తలా ముగ్గురికి హెల్ప్ చేయమను..” ఈ ఐడియా అప్పట్లో కొత్తగా అనిపించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుచుకుంటే.. సమాజంలో అన్యాయమే జరగదని, తోటివారికి సహాయపడటానికి ఇదొక మంచి ప్రయత్నమని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగపోగా.. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
“మొదట నువ్వు పెట్టుబడి పెట్టు.. తర్వాత నీకు తెలిసిన మరో ముగ్గురి చేత పెట్టించు.. వారిని తలో ముగ్గురి చేత ఇన్వెస్ట్ చేపించమను..” ఇదే కాన్సెప్ట్ తో కాసులు వెనకేసుకుంటున్నారు. తాజాగా, నగరంలోని కూకట్ పల్లి పరిధిలో క్రిప్టో కరెన్సీ పేరుతో జరిగిన మోసం చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. XCSPL పేరుతో వెలిసిన కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంది. మొదట లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ మొదట ఎరవేసింది. ఇదేదో బాగుందే అనుకున్న నగరవాసులు అప్పు చేసి, లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డులు వాడి అందులో ఒక్కొక్కరు రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి రాకపోవడంతో.. వారు నిర్వాహకులను గట్టిగా నిలదీశారు. దీంతో గొడవ పెద్దదై మీడియా చెవిన పడింది.
ఈ ఘటనపై స్పందించిన బాధితులు.. రూ. లక్ష కడితే రూ. 4 లక్షలు వస్తాయని ఆశచూపినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు లాభాలు కాదు కదా.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు వస్తాయని అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. ఈ మోసంపై XCSPL కంపెనీ నిర్వాహకులను మీడియా సిబ్బంది వివరణ అడగగా.. కేసు ఫైల్ అయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల నగరవాసులు అప్రమత్తంగా పోలీసులు హెచరిస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడి ఉన్నది పోగట్టుకోవద్దని తెలియజేస్తున్నారు.