కరోనా అనంతర పరిస్థితులను ఊహించలేకపోతున్నారు ప్రజలు. మరణంపై అంచనాలు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందులోనూ యవ్వనస్థులు దీని బారిన పడి చనిపోతున్నారు.
కరోనా అనంతర పరిస్థితులను ఊహించలేకపోతున్నారు ప్రజలు. మరణంపై అంచనాలు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందులోనూ యవ్వనస్థులు దీని బారిన పడి చనిపోతున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండటం లేదు అయినప్పటికీ హార్ట్ ఎటాక్ వీరిని బలి తీసుకుంటుంది. 40 ఏళ్లు దాటని వారు.. ఆరోగ్య పరంగా ఫిట్‌గా ఉంటున్న వారు సైతం హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. అప్పటి వరకు హాయిగా, తుళ్లుతూ హుషారుగా తిరిగిన యువకులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇప్పుడు మరో యువకుడు అతి చిన్న వయస్సులో గుండె పోటుతో మరణించాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. అయితే వారం రోజుల్లో ఆ జిల్లాలో ఇటువంటి ఘటన మూడవది కావడం కలవరపాటుకు గురిచేస్తుంది.
ఖమ్మం జిల్లాలో మరో విషాదం నెలకొంది. జిల్లా కాంగ్రెస్ నాయకుడు మానుకొండ రాధా కిషోర్ చిన్నకుమారుడు శ్రీధర్ (30) గుండె పోటుతో మరణించాడు. జిమ్ కెళ్లి ఇంటికి వచ్చిన అతడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఐదు నిమిషాల్లో గుండె పోటుతో ప్రాణాలు వదిలాడు. ఆదివారం నాడు తన అన్నయ్య కుమారుడు అన్నప్రాసన వేడుకలు జరగ్గా.. అందులో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. అయితే సోమవారం ఉదయం .. ఇంటికి సమీపంలోని జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేసుకుని, కారులో ఇంటికి వచ్చి, పార్క్ చేసిన తర్వాత.. ఆయాసంగా ఉందని రూములోకి వెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేంత సమయం లేకుండానే ఒక్కసారిగా నేలకొరిగాడు. అతడి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డిగ్రీ చేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న కొడుకు.. విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.