ఇటీవల నర్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాాజగా మరో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అసలేం జరిగిందంటే?
ఇటీవల నర్సింగిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ టీచర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు సైతం స్పందించి కాలేజీ ముందు భైటాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఇక సాత్విక్ ఆత్మహత్యపై రాష్ట్ర విద్యాశాఖమంత్రి స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అయితే ఈ ఘటన మరువకముందే తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం. ఇక్కడే ఒద్ది అభిరామ్ అనే విద్యార్థి స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఇటీవల అభిరామ్ బైక్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన అతని తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడతో అభిరామ్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. కొడుకు మరణించడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.