సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుసుంది. ఇటీవల జరిగిన రాంగోపాల్ పేట, దక్కన్‌మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. ఈ విషాదం చోటుచేసుకుంది. దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం.
నగరంలో అగ్ని ప్రమాదాలు మృత్యు ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎవరో చేసిన పాపాలకు మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన రాంగోపాల్ పేట, దక్కన్‌మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు యువతులు సహా ఆరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ భవనం మొత్తం 8 అంతస్తుల్లో విస్తరించి ఉండగా, మొదట 7వ ఫ్లోర్ లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అవి మెల్లమెల్లగా 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఆ తర్వాత 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు తీవ్రమయ్యాయి. ఇందులో వస్త్ర దుకాణాలతోపాటు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉండేది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేసే వారితోపాటు షాపింగ్‌కు వచ్చిన వారంతా గబగబా కిందికి దిగిపోయారు. కానీ, కొందరు మాత్రం దట్టమైన పొగ కమ్మేయడంతో కిందకు వెళ్లలేకపోయారు. అదే వారి ప్రాణాలు తీసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. భారీ క్రేన్ల సాయంతో మంటల్లో చిక్కుకున్న దాదాపు 15 మందిని అతి కష్టం మీద కాపాడారు. వీరిలో ఆరుగురు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను ప్రమీల (22), వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22), ప్రశాంత్ (23)లుగా అధికారులు ధ్రువీకరించారు. వీరిలో వెన్నెల (మర్రిపల్లి), శివ (నర్సంపేట), శ్రావణి (నర్సంపేట మండలం) వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా ప్రశాంత్ (కేసముద్రం), ప్రమీల (సురేష్‌నగర్) మహబూబాబాద్ జిల్లా వాసులు. త్రివేణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వారు. వీళ్లంతా బీఎం5 కాల్‌సెంటర్ ఉద్యోగులు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ రెండు బ్లాకులుగా మొత్తం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 400 వరకు షాపులు ఉన్నట్లు సమాచారం. ఒక్క సెల్లార్, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ లోనే 170 వరకు షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 వేల మందికి పైగా సిబ్బంది ఈ కాంప్లెక్స్‌లోని షాపుల్లో పనిచేస్తుంటారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కాస్త ఎక్కువుగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్‌లో మంటలు అంటుకునే సమయానికి 5,6,7 ఫ్లోర్లలో ఉన్న చాలా కార్యాలయాల నుంచి సిబ్బంది అప్పటికే వెళ్లిపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పింది. ఈ విషాద ఘటనకు బాధ్యులెవరో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.