తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి సాయంత్రం వేళ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న ఆగస్టు సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల మోకాలి లోతు నీళ్లు చేరాయి. 1-2 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా గంటకు పైగా సమయం పట్టిన పరిస్థితి కన్పించింది.
రాష్ట్రంలో హైదరాబాద్ సహా మరి కొన్ని ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఇవాళ కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గండి మైసమ్మ ప్రాంతాలతో పాటు చార్మినార్, చాంద్రాయణ గుట్ట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలి పురం, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు.
కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 15.1 సెంటీమీర్లు నమోదైంది. ఇక బంజారాహిల్స్‌లో 12 సెంటీమీటర్లు, యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్లు, కూకట్ పల్లిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.