ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లాయి.
గత నెల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. వరుసగా కురురిసి వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెరువులు, కాల్వలు నిండి పొంగి పొర్లుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో కాస్త పొడివాతావరణం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా అనిపించినా.. ఒక్కసారే కారు మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది.. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వివరాల్లోకి వెళితే..
గత నెల రోజలుగాహైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నాలుగైదు రోజుల నుంచి కాస్త ఎండకొడుతుంది.. పొడి వాతావరణం ఏర్పడింది. నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షం కురిసింది. నల్లకుంట, ముషిరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్క్, అంబర్ పేట్, విద్యా నగర్,రామాంతపూర్, ఓయూ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని.. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని తెలిపింది. ప్రస్తుతం నగరంలో చలి వాతావరణం నెలకొని ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, 23 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖాధికారుతు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపిస్తుంది.