అద్భుతమైన ఫీచర్లు. అద్దిరిపోయే కెమేరా కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు అందించే ఫోన్ తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కెమేరా మంచి క్వాలిటీ అందిస్తుంది. Oneplus Nord CE ఫోన్ అద్భుతమైన ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఆక్సిజన్ ఓఎస్‌తో పనితీరు బాగుంటుంది. తక్కువ ధరకే మంచి ఫీచర్లు లభిస్తుండటంతో మార్కెట్‌లో ఈ ఫోన్‌కు ఆదరణ ఎక్కువ ఉంది.
Oneplus Nord CE5 ఫీచర్లు
మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్‌సెట్ ప్రోసెసర్ దీని ప్రత్యేకత. యూజర్లకు ఎలాంటి అంతరాయం ఉండదు. మల్టీ టాస్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అటు గేమ్స్ కూడా 120 ఎఫ్‌పీఎస్‌తో చాలా మృదువుగా ఉంటుంది. 6.7 ఇంచెస్ సూపర్ ఫ్లూయిడ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమేరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉంటుంది. ఫోటో తీసేటప్పుడు సబ్జెక్ట్,బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఆటో అడ్జస్ట్ ఉంటుంది.
రిఫ్లెక్టివ్ షైనింగ్ మెటాలిక్ గ్రే కలర్, మిస్ట్ బ్లూ, సన్‌సెట్ రంగుల్లో అందుబాటులో ఉంది. 5జి కనెక్టివిటీ, డాల్బీ అట్మోస్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఉంది.
Oneplus Nord CE 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 24, 999 రూపాయలు కాగా 256 జీబీ స్టోరేజ్ ధర 26,999 రూపాయలుంది. ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 28,999 రూపాయలుగా ఉంది.