దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుంతుండడంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల కంపెనీలు ఒకటికి మించి మరొకటి కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమకి కంపెనీ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు కోమకి రేంజర్. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
ఈ బైక్‌లో 4 కిలోవాట్ అడ్వాన్స్‌డ్ లిథియం బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్. ఇది సింగిల్ చార్జిపై 250 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కోమాకి కంపెనీ పేర్కొంది. కొమాకి రేంజర్ 5000-వాట్ల మోటారుతో శక్తిని పొందుతుందని కంపెనీ వెల్లడించింది. ఇంకా ఈ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ అలాగే బ్లూటూత్ సిస్టంతోపాటు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే.. ఈ బైక్‌కు డిస్క్ బ్రేకే సిస్టం అందించారు. సుపీరియర్ సస్పెన్షన్ దీని సొంతం. ఇంకా ఈ బైక్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మొబైల్ చార్జింగ్ యూనిట్, రియర్ ప్రొటెక్షన్ గార్డ్, బ్లూటూత్ విత్ సౌండ్ సిస్టమ్, రివర్స్ కంట్రోల్, టెలిస్కోపిక్ షాకర్, డ్యూయెల్ ప్యాసిజంర్ ఫుట్ రెస్ట్, ఎల్ఈడీ ప్లస్ అడిషనల్ హెడ్‌ల్యాంప్, ఇన్‌క్లూజివ్ స్టోరేజ్ స్పేస్, కంఫర్టబుల్ సీటింగ్, రియర్ టెయిల్ ల్యాంప్ గార్డ్ సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర గరిష్టంగా రూ. 1.8 లక్షలుగా ఉంది. ధర ఎక్కువగా ఉన్నా అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ రేంజ్ దీని సొంతం. అందువల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బైక్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.
Komaki Ranger electric bike: Long-range, powerful electric vehicle that may change the EV market#electricvehicles #latestnews #evnews #automotivenews #evindustry #evmanufacturing #evbike #electricbike #ev #automotive #emobility #goelectric #OEM #india #komakiranger #longrange pic.twitter.com/jlBUaHmmpA
— Electric Vehicle World (@e_vehicleworld) January 5, 2023
గమనిక: ప్రాంతం ప్రాతిపదికన బైక్ ధరలలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.. గమనించగలరు.