భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ కంటూ కొన్ని పేజీలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువీ ఒంటిచేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని ఫార్మట్లకీ గుడ్ బై చెప్పిన యువీ.. వ్యాఖ్యతగా కొనసాగుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన పర్సనల్ లైఫ్.. డైలీ యాక్టివిటీస్ గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు. అయితే జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా తన అభిమానులకు యువరాజ్ సింగ్ జంట పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే యువరాజ్ సింగ్- హాజల్ కీచ్ తమ కుమారుడిని పరిచయం చేశారు.
యువీ దంపతులు తమ కుమారిడిని పరిచయం చేయడమే కాకుండా.. అతని పేరుని కూడా అనౌన్స్ చేశారు. కొడుకు, భార్యతో ఉన్న ఫొటోలను యువరాజ్ సింగ్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలకు.. ‘ఓరియన్ కీచ్ సింగ్ ఈ ప్రపంచానికి నీకు స్వాగతం. అమ్మానాన్న తమ పుత్తర్ ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీ పేరు లాగానే నీ ప్రతి చిరునవ్వుతో నీ కళ్లు ఎంతో ప్రకాశంగా మెరుస్తూ ఉంటాయి. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
జనవరి 26, గణతంత్ర దినోత్సవం రోజు యువరాజ్ సింగ్ దంపతులకు ఓరియన్ జన్మించగా.. దాదాపు 6 నెలల తర్వాత ఫాదర్స్ డే సందర్భంగా అతడిని ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. యువీ దంపతులు తమ కుమారుడికి పెట్టిన ఓరియన్ పేరుకు అర్థం.. కొన్ని నక్షత్రాల సమూహాలకు కొన్ని పేర్లు ఉంటాయి. అలాంటి నక్షత్రాల సమూహాల్లో ఓరియన్ కూడా ఒకటి. ఇది ఎంతో ప్రకాశంగా ఉండటమే కాకుండా.. ప్రపంచంలో ఏ మూలకు అయినా ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. యువరాజ్ సింగ్ కుమారుడిని పరిచయం చేయండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Many many congratulations @YUVSTRONG12! May little prince have the best of everything! ❤️❤️ https://t.co/9L3ZQb1BWq
— Gautam Gambhir (@GautamGambhir) June 19, 2022