SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » World Boxing Championship 2022 Winner Nikhat Zareen Bio In Telugu

Nikhat Zareen: నిఖత్‌ జరిన్‌.. ఆమె పంచ్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ దాసోహం!

  • Written By: Dharani
  • Published Date - Fri - 20 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nikhat Zareen: నిఖత్‌ జరిన్‌.. ఆమె పంచ్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ దాసోహం!

పుట్టింది సంప్రదాయ కుటుంబం.. మొత్తం నలుగురు ఆడప్లిలలే. మూడో సంతానంగా జన్మించిన ఆమెకు తండ్రి మాదిరే క్రీడల మీద ఆస​క్తి కలిగింది. తొలుత పరుగుపందెంలో రాణించింది. కానీ కోచ్‌ సలహా మేరకు బాక్సింగ్‌ను ఎంచుకుంది. అది చూసి బంధువులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. ‘‘హవ్వా.. ఆడపిల్లవు.. ఇలా మగ పిల్లలు ఆడే ఆటలా.. బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంత బలం కావాలి.. ఎన్ని దెబ్బలు తట్టుకోవాలి.. ముఖం మీద దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా.. అసలు పెళ్లి అవుతుందా’’ అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. వారందరి మాటలు విని బెదిరిపోలేదు.. భయపడలేదు.. రింగ్‌లో సివంగిలా పంచులు విసురుతూ.. వాటన్నింటిని పటాపంచలు చేసి.. నేడు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగింది. ఈ విజయం వెనక ఎంతో కష్టం, ఎన్నో అడ్డంకులు, అవమానాలు. వాటిన్నింటిని దాటుకుని.. నేడు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగిన తెలుగమ్మాయి నిఖత్‌ జరిన్‌ గురించి ప్రత్యేక కథనమిది..

నిఖత్‌ స్వస్థలం నిజామాబాద్‌. ఆమె కెరీర్‌ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్‌ అహ్మద్‌ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్‌ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్‌ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్‌ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్‌ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్‌ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్‌ జూనియర్‌ స్థాయిలో బెస్ట్‌ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది.

Nikhat Zareen's punch was shown in the Boxing World Championship

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: Rinku Singh: రింకూ సింగ్‌.. మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడు! ఎవరితను?

సాధించిన విజయాలు..

ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్‌ 2011లో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్‌ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్‌ కప్, థాయిలాండ్‌ ఓపెన్‌లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్‌ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్‌ తారగా గుర్తింపు దక్కింది. నెక్స్ట్‌ టార్గెట్‌.. ఒలంపిక్స్‌. దానికోసం ఎంతో కష్టపడుతుంది నిఖత్‌. అయితే అనుకోకుండా ఒలింపిక్స్‌కు ముందు ఇండియా తరఫున 51 కిలోల కెటగిరీలో ఏ ట్రయల్స్‌ లేకుండానే మేరీకామ్‌ను ఎంపిక చేశారు. దీనిపై నిఖత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిర్‌ ట్రయల్స్‌ కావాలని పట్టుబట్టింది. చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు. ట్రయల్స్‌ నిర్వహించారు.

ఆ అవమానం పెంచిన కసితో..

Nikhat Zareen's punch was shown in the Boxing World Championship

‘నిఖత్‌ జరీన్‌ ఎవరు’… తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్‌ గురించి మేరీ కోమ్‌ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్‌ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్‌ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్‌ విజ్ఞప్తి అంగీకరించారు.. కానీ ఈ పోటీలో మేరీకోమ్‌ చేతిలో ఓటమి ఎదురైంది. పోటీ ముగిసిన తర్వాత కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్‌ హ్యాండ్‌ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితి నుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఆడగలనో.. లేదో అనే భయం ఉన్నా… ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు ట్రెండ్జ్‌ టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్‌… ఇప్పుడు నేరుగా వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి: Mushfiqur Rahim: అందరూ నన్ను ‘బ్రాడ్‌మాన్’ అంటుంటారు: ముష్ఫికర్ రహీమ్

సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతి నుంచి ఆమె ‘కొత్త కెరీర్‌’ను మొదలుపెట్టింది. సీనియర్‌ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయాలకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్‌ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్‌ బ్యాక్‌ఫుట్‌ బాక్సర్‌. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్‌ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్‌ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్‌ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది. ఆమె సాధించిన విజయం పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 Nikhat Zareen's punch was shown in the Boxing World Championship

ముందున్న సవాల్‌ ఇదే…

పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్‌ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. ఇక 2024లో నిఖత్‌ జరిన్‌ తప్పక పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక నిఖత్‌ జరిన్‌ సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ మరణం వెనుక ఆస్ట్రేలియన్ క్రికెటర్! సోషల్ మీడియాలో వార్తలు!

Tags :

  • boxing
  • Mary Kom
  • Nikhat Zareen
  • Olympics
  • Sports News
  • Telangana
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

    ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

    ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

    రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam