జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 4×400 మీటర్ల రిలేలో మహిళల బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. కిరణ్ పహల్, పూవమ్మ మచెట్టిర, ప్రాచి, విత్య రామ్‌రాజ్‌లతో కూడిన టీమ్ అగ్రస్థానంలో నిలిచింది. బహ్రెయిన్, చైనా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. మరోవైపు, 4×400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆసియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 52కి పెరిగింది. వీటిలో ఆరు గోల్డ్ మెడల్స్ కాగా.. 21 రజతం, 25 కాంస్య పతకాలు ఉన్నారు.
రేసులో భారత్‌కు చివరి ల్యాప్ అత్యంత కీలకంగా మారింది. చివరి దశలో బహ్రెయిన్ నుంచి సల్వా ఈద్ నాసర్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే యాంకర్‌గా బరిలోకి దిగిన విథ్యా రామ్‌రాజ్ ఒత్తిడిని అధిగమించి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో భారత బృందం స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ బృందానికి మహిళల 4×400 మీటర్ల రిలే స్వర్ణం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఈ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని అందుకుంది. Vithya Ramrajకు నాగోయా ఏషియన్ గేమ్స్‌లో ఇది మరో పతకం. అంతకుముందు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె బ్రాంజ్ పతకం సాధించింది. ఆ రేసులో 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో పరుగెత్తి.. పి.టీ.ఉష పేరిట 42 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. తాజాగా పురుషుల 5,000 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ క్రీడల్లో అతడికి ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు 1,500 మీటర్లు, 10,000 మీటర్ల ఈవెంట్లలో సిల్డర్ మెడల్స్ ప గెలుచుకున్నాడు. ఒకే ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో మూడు పతకాలు గెలుచుకున్న రెండో భారత పురుష క్రీడాకారుడిగా నిలిచాడు.
A medal AND a national record! 🥉🔥
Vithya Ramraj powers to bronze in the women’s 400m hurdles at the Asian Games 2026 with a personal best of 54.75 🇮🇳 pic.twitter.com/PniVivE7ce
— Khel Now (@KhelNow) September 28, 2026
