టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. జూలై 1 నుంచి రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టును ఆడనుంది. కానీ.. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ సోకి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో టెస్టు మ్యాచ్ ప్రారంభ సమయానికల్లా అతను కోలుకోకపోతే.. రోహిత్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగాల్సిన పరిస్థితి. దీంతో టీమిండియాను ఇంగ్లండ్‌తో సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో ఎవరు నడిపిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. రోహిత్ అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతలు టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు దక్కుతుంది.
కానీ కీలకమైన మ్యాచ్‌లో ఇంతకుముందు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించని బుమ్రాకు అప్పగిస్తే అతని ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. టీమిండియా 1983లో తొలిసారి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ తర్వాత టీమిండియా మరే పేస్ బౌలర్ నాయకత్వం వహించలేదు. ఒక వేళ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే.. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఒక పేస్ బౌలర్ టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. అనుభవం లేమి, సిరీస్ డిసైడింగ్ ఫ్యాక్టర్‌తో పాటు టీమిండియా పేస్ దళానికి నాయకత్వం వహించే బుమ్రాపై ఒత్తిడి పెంచితే అతని ప్రదర్శన దెబ్బతిని అది భారత గెలుపోటములపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. అందుకే అతనికి కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక్క మ్యాచ్ కోసం మరలా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
టెస్టు జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లీ స్టైలే వేరు. టెస్టు ఫార్మాట్లో ప్రపంచలోనే కోహ్లీకి బెస్ట్ కెప్టెన్‌గా పేరుంది. పైగా ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్ల బలాబలాలపై కోహ్లీకి మంచి అవగాహన ఉంది. అలాగే జట్టులో సీనియర్ ప్లేయర్ కూడా. ఇంగ్లండ్‌తో గతంలో జరిగిన నాలుగు టెస్టులు కూడా కోహ్లీ సారథ్యంలోనే జరగడంతో.. ఈ చివరి టెస్టు కూడా అతని కెప్టెన్సీలోనే జరిపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. విరాట్ కోహ్లీ కూడా టెస్టు ఫార్మాట్లో కెప్టెన్సీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదులుకుని టెస్టు కెప్టెన్‌గా కొనసాగలని భావించాడు. కానీ.. బీసీసీఐ వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడంతో అతను టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. కానీ.. మరలా కెప్టెన్సీ చేయమని బీసీసీఐ కోరితే కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పడం కష్టం. కానీ.. కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాని అతని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
బుమ్రా, కోహ్లీ… వీళ్లిద్దరూ కాకుండా బీసీసీఐకి మరో ప్రత్యామ్నయం కూడా ఉంది. బుమ్రాపై అనవసరపు భారం మొపొద్దని బీసీసీఐ భావించినా, కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించినా.. యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురిలో టీమిండియాను ఒక టెస్టు మ్యాచ్‌లో ఎవరు నడిపిస్తారో వేచి చూడాల్సిందే. మరి రోహిత్ ఆడకుంటే ఈ ముగ్గురిలో ఎవరు టీమిండియాకు కెప్టెన్‌గా ఉండాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ind vs eng
Very Excited pic.twitter.com/AHyfdxMCvy— Vishal Sharma (@vishal29vs) June 27, 2022