తేజ నిడమానూరు అంటే పెద్దగా పరిచయం లేని పేరు. ప్రస్తుతం నెదర్లాండ్స్ తరపున జాతీయ జట్టుకి ఆడుతున్న ఈ బ్యాటర్ మన ఇండియావాడు మాత్రమే కాదు తెలుగు వాడు కూడా. అయితే ఈ నెదర్లాండ్స్ క్రికెటర్ మాత్రం అచ్చం ధోని చేసినట్టే ఒక పని చేసి ఆశ్చర్యపరిచాడు.
కొంతమంది ఏం చేసినా ఊహకు అందవు. ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. అనూహ్యమైన పనులు చేస్తూ అందరిని షాక్ గురి చేస్తారు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు తమ ఆటిట్యూడ్ మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధమ వరుసలో నిలుస్తాడు. అయితే ధోనీని బ్లైండ్ గా ఫాలో అయ్యేవారు చాలామందే ఉన్నారు. కానీ నెదర్లాండ్స్ క్రికెటర్ తేజ నిడమానూరు మాత్రం అచ్చం ధోని చేసినట్టే ఒక పని చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ చేసిన పని వైరల్ అవుతుంది. అదేదే రికార్డులు అనుకుంటే పొరపాటే. ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం.
తేజ నిడమానూరు అంటే పెద్దగా పరిచయం లేని పేరు. ప్రస్తుతం నెదర్లాండ్స్ తరపున జాతీయ జట్టుకి ఆడుతున్న ఈ బ్యాటర్ మన ఇండియావాడు మాత్రమే కాదు తెలుగు వాడు కూడా. విజయవాడ ఇతడి జన్మ స్థలం. కెరీర్ దృష్ట్యా నెదర్లాండ్స్ కి వెళ్లిన తేజా.. అక్కడే స్థిరపడిపోయాడు. క్రికెట్ మీద ఇష్టంతో నెదర్లాండ్స్ జాతీయ జట్టులోకి అడుగు పెట్టి అక్కడ రాణిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐసీసీ క్వాలిఫయర్స్ లో భాగంగా వెస్టిండీస్ మీద వీరోచిత సెంచరీ చేసి జట్టుని గెలిపించి వార్తలో నిలిచాడు. సూపర్ సిక్స్ లో భాగంగా అదే ప్రదర్శన కనబర్చి వరల్డ్ కప్ కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో గుండు కొట్టించుకున్నాడు తేజ నిడమానూరు.
తేజ నిడమానూరు క్వాలిఫయర్స్ కి ముందు నెదర్లాండ్స్ జెట్టు వరల్డ్ కప్ కి అర్హత సాధిస్తే గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చాడు. పటిష్టమైన విండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్ జట్లను కాకుండా నెదర్లాండ్స్ వరల్డ్ కప్ కి అర్హత సాధించడం విశేషం దీంతో చెప్పిన మాట ప్రకారం ఈ తెలుగు కుర్రాడు గుండు కొట్టించుకొని భారత్ లోకి అడుగుపెట్టబోతున్నాడన్నమాట. 2011 వరల్డ్ కప్ సమయంలో ఇండియా గెలిచినా సందర్భంగా ధోని కూడా తన పాత హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చేసి గుండు కొట్టించుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా అదే సీన్ రిపీట్ అయింది. మొత్తానికి చెప్పిన మాట నిలబెట్టుకొని ధోనిని గుర్తు చేసాడు తేజ నిడమానూరు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Teja Nidamanuru fulfills the promise of shaving his head if Netherlands qualify for the 2023 World Cup.
by u/Kathanayagan-3821 in Cricket