గత కొంత కాలంగా టీమిండియా ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అవకాశం దొరికినప్పుడల్లా ప్లేయర్లపై విమర్శల తూటాలు వదులుతూనే ఉంటాడు. తాజాగా మరోసారి తననోటికి పనిచెప్పాడు గంభీర్. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటుగా, టీమిండియా సెలక్టర్లు, కోచ్ ద్రవిడ్ పై కూడా విమర్శలు గుప్పించాడు. సెలక్టర్లు ఈ ముగ్గురిని దాటి జట్టు సెలెక్షన్ పై దృష్టి పెట్టాలని, అలాగే వారిని జట్టు నుంచి తప్పించదలిస్తే.. సీనియర్లు అని కూడా చూడకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీమిండియా స్టార్ ప్లేయర్స్ తో పాటుగా బీసీసీఐ అధికారులు కూడా ఫైర్ అవుతున్నారు.
గౌతమ్ గంభీర్ టీమిండియా సీనియర్ ప్లేయర్స్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై స్టార్ ఆటగాళ్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఓ వెకేషన్ లో ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు ఈ విషయంపై స్పందిస్తు..”ఆటగాడిగా గంభీర్ జట్టుకు చేసిన సేవలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. కానీ ఈ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. అతడి సేవల్ని మేం గౌరవించినప్పుడు.. అతడు కూడా మా సేవల్ని గౌరవించాలి” అని చెప్పుకొచ్చాడు. మరికొంత మంది ప్లేయర్స్ తో పాటుగా BCCI అధికారి ఒకరు గంభీర్ తీరును తప్పుపట్టారు. అసలు ప్రస్తుతం గంభీర్ కు టీమిండియా జట్టుతో సంబంధం లేదని, అతడు ఓ ఔట్ సైడర్ అని ఆ అధికారి చెప్పుకొచ్చాడు. ఇక గంభీర్ ఓ పెద్ద వదరుబోతు, నసగాడు అంటూ అతడి మాటలపై మండిపడ్డాడు. అసలు అతడికి జట్టులో ఏం జరుగుతుందో తెలీదని ఎద్దేవచేశాడు.
ఈ క్రమంలోనే గంభీర్..” టీమిండియాలో సీనియర్ బ్యాట్స్ మెన్స్ అయిన కోహ్లీ, రోహిత్, రాహుల్ లను దాటి సెలెక్టర్లు ఆలోచించాలని, వారిని జట్టు నుంచి తప్పించాల్సి వస్తే.. సీనియారిటీని పరిగణంలోకి అస్సలు తీసుకోరాదని” గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోచ్ ద్రవిడ్ తీరును కూడా గంభీర్ తప్పుపట్టాడు. జట్టును, కెప్టెన్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతే ఎలా? ఐసీసీ టైటిల్స్ గెలవాలి అంటే ఓ స్థిరమైన జట్టును ఏర్పాటు చేసుకోవాలంటూ గంభీర్ అన్నాడు. రెస్ట్ తీసుకుంటా అన్న ఆటగాళ్లను వరల్డ్ కప్ లో ఆడించకూడదని, రోహిత్, కోహ్లీలు కూడా ఈ పరిధిలోకి వస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఫైర్ అయ్యారు.