త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా ఏడాది తరువాత టీ20 జట్టులో చేరిన శుభమన్ గిల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరి ఆ నలుగురు క్రికెటర్ల పరిస్థితి ఏంటి, రిటైర్ అయినట్టేనా..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టీ20కు దూరం కాగా ఇతర క్రికెటర్లతో భారత జట్టు యూఏఈ పయనం కానుంది. సెప్టెంబర్ 7 నుంచి యూఏఈ వేదికగా 8 జట్లతో ఆసియా కప్ 2025 జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ 202 టీ20లో నలుగురు టీమ్ ఇండియా క్రికెటర్లకు స్థానం లభించకపోవడంతో ఆ ఆటగాళ్ల భవిష్యత్ సందేహంగా కన్పిస్తోంది. ఇక ఈ నలుగురు రిటైర్ అయిపోతారా అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ నలుగురి కెరీర్ దాదాపుగా ముగిసినట్టేనంటున్నారు.
శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ అవుట్…
ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా జట్టులో శ్రేయస్ అయ్యర్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ 2025, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీల్లో అద్భుతమైన ఆటుతీరు కనబర్చినా అయ్యర్ చోటు సంపాదించుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించినప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆటతీరులో ఎలాంటి లోపం లేదని చెప్పడం గమనార్హం. మరి అలాంటప్పుడు ఎందుకు తప్పించారనేది బీసీసీఐ సెలెక్టర్లకే తెలియాలి. అందుకే శ్రేయస్ అయ్యర్ ఇక టీ20 నుంచి రిటైర్ కావచ్చని తెలుస్తోంది. ఇక 2022లో తొలిసారిగా టీ20 ఇండియా జట్టులో చేరిన కేఎల్ రాహుల్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించినా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇతని స్థానంలో జితేష్ శర్మకు స్థానం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అందుకే కేఎల్ రాహుల్ టీ20కు దూరం కావచ్చనే మాట విన్పిస్తోంది.
మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి
ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియాలో అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ మొహమ్మద్ షమిను బీసీసీఐ తీసుకోలేదు. ఇతని స్థానంలో యూవ పేసర్లకు అవకాశం ఇచ్చారు. ఇక మరో పేసర్ మొహమ్మద్ సిరాజ్ సైతం టీమ్ ఇండియా ఆసియా కప్ 2025 జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించి జట్టు విజయానికి కారణమైనా ఆసియా కప్‌కు దూరంగా ఉంచారు సెలెక్టర్లు. షమీతో పాటు సిరాజ్ కూడా టీ20 భారతజట్టుకు ఇకపై ఆడకపోవచ్చని తెలుస్తోంది.