టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు నిలదొక్కుకుంటే.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. ఆ విషయాన్ని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ నిరూపించాడు. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించి టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అతనితో పాటు.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 53 పరుగులతో అదరగొట్టాడు. అయినా కూడా.. వీరిద్దరి కంటే టీమిండియాలో మరో డేంజరస్ బ్యాటర్ ఉన్నాడంటూ నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఆ బ్యాటర్‌కు బౌలింగ్ వేసే సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు కూడా పాల్ తెలిపాడు. ఇంతకూ.. కోహ్లీ, రోహిత్ కంటే కూడా ఎక్కువగా నెదర్లాండ్స్ పేసర్‌ను భయపెట్టింది ఎవరనుకుంటున్నారా? ఇంకెవరూ.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే సూర్యనే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కితాబిచ్చాడు. గురువారం భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన వాన్.. సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ప్రమాదకరమైన ఆటగాడని.. అతనికి బౌలింగ్ వేసే సమయంలో తాను ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నాడు.
ఇక గ్రౌండ్ ఏదైనా.. పిచ్ ఎలా ఉన్నా.. బౌలర్ ఎవరైనా.. పట్టించుకోకుండా పిచ్చికొట్టుండు కొట్టడంలో సూర్య దిట్ట. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మిస్టర్ 360 ప్లేయర్. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాలో అతనే తురుపుమొక్క. జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సమర్థుడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. గురువారం నెథర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరొగొట్టాడు. 25 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీతో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇప్పటికే విరాట్-సూర్య జోడీ సూపర్ హిట్ అయింది.
Netherlands speedster van Meekeren said that he found it most difficult to bowl to #SuryakumarYadav.
“I will take that as a compliment but wouldn’t say more. Will continue batting the way I do,” SKY replied. #T20WorldCup2022 #INDvsNED @kcvblr https://t.co/7ErxKwwqLe
— Sportstar (@sportstarweb) October 27, 2022