టీమిండియా మ్యాచ్ లు వన్ సైడ్ గా ఉంటే కిక్ ఏముంటుంది. చివరి ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్ జరిగి అందులో మనం గెలిస్తే ఉంటుంది నా సామి రంగా, సూపర్ అంతే. ఈ సారి టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ అలాంటివే ఆడింది. పాక్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచులైతే థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా అనే టెన్షన్ క్రియేట్ చేశాయి. రెండో ఇన్నింగ్స్ జరుగుతున్నంత సేపు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టాయి. ఇప్పుడు అలాంటి ఓ మ్యాచ్ గురించి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మనం వాడుక భాషలో కొన్ని పంచ్ డైలాగ్స్ వేస్తుంటాం. అవి రియాలిటీలో జరిగితే మాత్రం కచ్చితంగా నవ్వుకుంటాం. టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి ఉన్న టైంలోనూ అదే జరిగింది. అది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. తాజాగా భారత్-బంగ్లా మ్యాచ్ చివరి బంతి వరకు వచ్చినప్పటికీ విజయం మాత్రం మనల్నే వరించింది. దీంతో 2016 టీ20 ప్రపంచకప్ లోనూ ఇలానే ఈ రెండు జట్ల మ్యాచ్ తనని తెగ టెన్షన్ పెట్టేసిందని రవిశాస్త్రి చెప్పాడు.
‘చివరి ఓవర్ హార్దిక్ పాండ్యకు ధోనీ బౌలింగ్ అప్పగించాడు. దీంతో తర్వాత ఏం జరుగుతుందోనని టెన్షన్ తట్టుకోలేకపోయాను. వాష్ రూమ్ కి వెళ్లి వచ్చాను.’ అని రవిశాస్త్రి చెప్పాడు. ఇక సూపర్ -10 దశలో బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాకు 147 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇక ఛేదనలో బంగ్లా గెలవాలంటే చివరి ఓవర్ 11 పరుగులు చేయాలి. తొలి మూడు బంతుల్లో 9 పరుగులు చేసేసరికి టీమిండియా ఫ్యాన్స్ మ్యాచ్ ఓడిపోయామని అనుకున్నారు. కానీ 2 బంతుల్లో హార్దిక్ రెండు వికెట్లు తీయగా.. చివరి బంతికి ధోనీ చేసిన రనౌట్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్.