నెదర్లాండ్స్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అందరూ అనుకున్న విధంగానే జరిగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ ఆశించిన మేర రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 91 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ సునాయాసంగానే గెలిచేలా కనిపిస్తోంది. అయితే నెదర్లాండ్స్ మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. అద్భుతమైన రనౌట్ తో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(4) ని పెవిలియన్ చేర్చారు. పాకిస్తాన్ ని అంత తేలిగ్గా గెలవనిచ్చేలా లేరు. అయితే ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఇన్నింగ్స్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ బౌలర్ వేసిన ఒక బంతికి బ్యాట్స్ మన్ కు గాయం అయ్యింది. అయితే కాస్త అటూ ఇటూ అయితే ఆటగాడి కంటికి ప్రమాదం జరిగుండేది. ఆరో ఓవర్లో హారిస్ రౌఫ్ ఫాస్ట్ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. అది నేరుగా బస్ డే లీడే హెల్మట్ కు తాకింది. అది ఎంత బలంగా తాకింది అంటే.. ఆ హెల్మెట్ అతని ముఖానికి గట్టిగా తాకి.. కంటి కింద ముఖం పగిలిపోయింది. రక్తం కూడా వచ్చింది. వెంటనే నెదర్లాండ్స్ ఫిజియో వచ్చి బస్ డే లీడేని పరీక్షించి అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. కంటి కింద చర్మం పగలడంతో 4 కుట్లు వేశారు. రౌఫ్ వేసిన బంతితో గాయం కావడం వల్ల.. బస్ డే లీడే రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. అతడు 16 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు.
We hope Bas De Leede Recover soon 🤞. pic.twitter.com/J4GFao4qlu
— Cricerz (@cricerz) October 30, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అకెర్ మన్(27), ఎడ్వర్డ్స్(15) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయారు. షదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు, మహ్మద్ వసీం జూనియర్ కు 2 వికెట్లు దక్కాయి. షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, రౌఫ్ లకు తలో వికెట్ దక్కింది. అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు నెదర్లాండ్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే 7.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మొదట.. పాకిస్థాన్ 10 ఓవర్లలోనే మ్యాచ్ గెలిచేలా కనిపించినా కూడా.. నెదర్లాండ్స్ మాత్రం బాగా కట్టడి చేస్తోంది. అయితే ఏమైనా అద్భుతం జరుగుతుందేమో చూడాల్సి ఉంది.
Haris rauf’s bouncer 🔥.
Haris Rauf’s nasty delivery hits Bas de Leede on the grille in front of the nose
There’s a cut on his face, just under his left eye .#T20WorldCup2022 #PAKvsNED pic.twitter.com/XslpYkPWFk— Intro Vert (@cageddbird) October 30, 2022
Ouch 🤕 Bas de Leede has concussion after being hit in the grille by a Haris Rauf short ball – Logan van Beek has been approved as his substitute#NEDvPAK pic.twitter.com/mrkAohJw26
— Happy Chaudhary (@happykhus) October 30, 2022