ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ చాలా సందడిగా జరుగుతోంది. పాక్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన టీమిండియా.. మిగతా మ్యాచుల్లోనూ అదరగొట్టేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీసు చేస్తోంది. ప్రస్తుతం జట్టులో అందరూ ఆటగాళ్లు రాణిస్తున్నారు. దీంతో కొందరు స్టార్ ఆటగాళ్లు బెంచ్ కే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో యజ్వేంద్ర చాహల్ ఒకడు. ప్రస్తుతం భార్య ధనశ్రీతో కలిసి ఆస్ట్రేలియాలోని బీచ్ ల అందాల ఆస్వాదిస్తున్నాడు. వాటిని కెమెరాలో బంధిస్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దాదాపు నాలుగైదేళ్ల నుంచి జట్టులో చాహల్ కీలక స్పిన్నర్ గా ఎదిగాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో వికెట్లు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ కోసం మనోడిని కాదని వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ని ఎంపిక చేశారు. ఈసారి చాహల్ ని సెలెక్ట్ చేసినప్పటికీ.. అక్షర్ పటేల్, అశ్విన్ టీమ్ ఎలెవన్ లో ఉంటున్నారు. దీంతో చాహల్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు. బౌండరీ లైన్ దగ్గర ఐకానిక్ పోజులిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు.
ఇక చాహల్ భార్య ధనశ్రీ.. ఈ మధ్య డ్యాన్స్ చేస్తూ గాయపడింది. దీంతో కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ ఆమెకి సుచించారు. దీంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. భర్తతో కలిసి బీచ్, లోకేషన్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. జట్టులో ఛాన్స్ లేకపోయినప్పటికీ.. చాహల్ తన భార్యతో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు! మరోవైపు ధనశ్రీ కొన్ని ఫొటోల్ని సూర్య కుమార్ యాదవ్ కూడా క్యాప్చర్ చేయడం విశేషం.