SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shafali Verma Smashed 26 Runs In One Over In Under 19 T20 Womens World Cup

వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ! దుమ్మురేపిన షఫాలీ, శ్వేతా

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 15 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ! దుమ్మురేపిన షఫాలీ, శ్వేతా

ఇండియన్‌ అమ్మాయిలు అదరగొట్టేశారు. అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ షఫాలీ వర్మ ఒకే ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లు, చివరి బంతికి ఒక సిక్స్‌ కొట్టి ఏకంగా 26 పరుగులు రాబట్టుకుంది. అలాగే కేవలం 16 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు సాధించింది. షఫాలీతో పాటు ఓపెనర్‌ శ్వేతా సెహ్రావత్ సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. కేవలం 57 బంతుల్లోనే 20 ఫోర్లతో 92 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. టీమిండియాను గెలిపించింది. బెనోనిలోని విల్లోమూర్ పార్క్ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ 2023 తొలి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ సిమోని 61 రన్స్‌తో రాణించింది. ఇక భారత బౌలర్లలో కెప్టెన్‌ షఫాలీ వర్మ 2, సోనమ్‌ యాదవ్‌, పీ చోప్రా తలో వికెట్‌ పడగొట్టారు. ఇక 167 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఓపెనర్‌ శ్వేత 92 పరుగులతో చెలరేగి ఆడింది. అలాగే మరో ఓపెనర్‌, కెప్టెన్‌ షఫాలీ వర్మ సైతం తన పవర్‌ హిట్టింగ్‌తో సౌతాఫ్రికా బౌలర్లలకు చుక్కలు చూపించింది. కేవలం 16 బంతుల్లోనే 9 ఫోరు​, ఒక సిక్స్‌ బాదేసింది. ఫోర్లు, సిక్స్‌తోనే 42 పరుగులను కొట్టేంది. ఇక మొత్తం 45 రన్స్‌ చేసిన షఫాలీ.. ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ తొలి బంతికి అవుటైంది. అప్పటికే టీమిండియా 77 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.

Shafali Verma

Join Our Whatsapp Channel

ముఖ్యంగా సౌతాఫ్రికా బౌలర్‌ న్తబిసెంగ్ నిని వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో అయితే షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆ ఓవర్‌లో అన్ని బంతులను బౌండరీ లైన్‌ దాటించింది. తొలి 5 బంతుల్లో వరుసగా ఐదు ఫోర్లు బాదిన షఫాలీ.. చివరి బంతిని సిక్స్‌గా మలిచి.. ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఇక షఫాలీ అవుటైన తర్వాత.. వన్‌డౌన్‌లో వచ్చిన మన తెలుగమ్మాయి త్రిషా 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగుల చేసి ఒక డిసెంట్‌ నాక్‌ ఆడింది. విజయం ముంగిట్లో 10 పరుగులు చేసిన సౌమ్య తివారి అవుట్‌ అయింది. చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్‌ శ్వేతా 92 రన్స్‌తో సోనియా 1 రన్‌తో నాటౌట్‌గా నిలిచారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై అలాగే షఫాలీ వర్మ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Shafali Verma smashed 4,4,4,4,4,6 in a single over.pic.twitter.com/A1oNRCd61L

— Johns. (@CricCrazyJohns) January 14, 2023

4️⃣4️⃣4️⃣4️⃣4️⃣6️⃣ 🔥🔥

Skipper @TheShafaliVerma scores 26 runs in the sixth over as #TeamIndia move to 70/0 after 6 overs.

Solid start in the chase for #TeamIndia 🙌

Follow the match👉https://t.co/sA6ECj9P1O…#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/LAATIxQjPc

— BCCI Women (@BCCIWomen) January 14, 2023

Tags :

  • Cricket News
  • Shafali Verma
  • Under 19 T20 Women's WC
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam