టీమిండియా క్రికెటర్లకు ఒకప్పుడు ఫేవరెట్ ప్లేయర్ అంటే సచిన్ మాత్రమే. తరం మారిన తర్వాత ఆ ప్లేసులోకి ధోనీ వచ్చాడు. ఇక మహీ రిటైర్ అయిన తర్వాత ఆ రేంజ్ ప్లేయర్ జట్టులో కనిపించలేదనే చెప్పాలి. ఏదైనా సరే సచిన్ అద్భుతమైన బ్యాటర్. ఆయన్ని అస్సలు తక్కువ చేయలేం. ఇక కెప్టెన్ – వికెట్ కీపర్ గా తనదైన ముద్ర వేసిన ధోనీ… చాలామంది క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచాడు. ఆ విషయాన్ని సదరు ఆటగాళ్లు పలు సందర్భాల్లో బయటపెడుతూనే ఉంటారు. తాజాగా ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోనీ నుంచి తాను ఏమేం నేర్చుకున్నానో బయటపెట్టాడు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ చూసేవాళ్లకు రుతురాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. యూఏఈలో జరిగిన గత సీజన్ లో అదరగొట్టే బ్యాటింగ్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా ఓ సెంచరీ చేయడంతో పాటు అన్ని మ్యాచుల్లో కలిపి 635 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. గతేడాది సీఎస్కే జట్టు టైటిల్ కూడా గెలుచుకుంది. టోర్నీ చరిత్రలో నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విషయంలో రుతురాజ్ కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు. దీంతో రీసెంట్ గా జరిగిన రిటెన్షన్ ప్రక్రియలోనూ చెన్నై జట్టు ధోనీ, జడేజా లాంటి సీనియర్స్ తో పాటు రుతురాజ్ ని అట్టిపెట్టుకుంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు రుతురాజ్ విషయంలో ఎంత మంచి ప్లేయర్. ఇతడు ఇలా మారడం వెనక ధోనీ పాత్ర ఉంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు.
‘మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ 15 నిమిషాలు సైలెంట్ అయిపోయేవారు. కానీ మహీ భాయ్ మాత్రం ప్రజెంటేషన్ నుంచి తిరిగొచ్చాక మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేవాడు. టరిలాక్స్ బాయ్స్, ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది’ అనేవాడు. మేం గెలిచినా ఓడినా సరే జట్టు స్ఫూర్తి ఒకేలా ఉండేలా ధోనీ చూసేవాడు. గెలిచినా, ఓడినా ఒకేలా ఉండటం ధోనీ దగ్గర నేర్చుకున్నాను. ఓడితే ఎంతో డిసప్పాయింట్ అయ్యేవాళ్లం కానీ నెగిటివిటీ, ఒకరిని నిందించడం మాత్రం ఉండేది కాదు. వరసగా మ్యాచులు ఓడిపోయినప్పుడు.. జట్టులోని రకరకాల గ్రూప్స్ ఏర్పడుతుంటాయి. కానీ చెన్నై జట్టులో ధోనీ అలా జరగనీయలేదు. మ్యాచ్ తర్వాత ధోనీ పెట్టే మీటింగ్స్ కూడా చాలా తక్కువ సేపే ఉంటాయి. ఓడినా సరే రెండు లేదా మూడు నిమిషాలు మాత్రం ఉంటుందంతే. చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిసారి గెలవడం సాధ్యమయ్యే పనికాదని మాకు అర్థమయ్యేలా చెప్పేవాడు’ అని ధోనీ దగ్గర తాను నేర్చుకున్న విషయాల్ని రుతురాజ్ చెప్పాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచులో మహారాష్ట్రకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్… 159 బంతుల్లో 220 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 48వ ఓవర్ ముందు వరకు 147 బంతుల్లో 165 పరుగులతో ఉన్న రుతురాజ్.. తర్వాతి ఓవర్ పూర్తయ్యేసరికి డబుల్ సెంచరీ దాటేశాడు. ఏకంగా ఒకే ఓవర్ లో నోబాల్ తో కలిపి ఏడు సిక్సులు బాదాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన మహరాష్ట్ర జట్టు.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇక విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్.. డిసెంబరు 2న జరగనుంది. మరి ధోనీ దగ్గర నుంచి రుతురాజ్ కూల్ నెస్ నేర్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
In a league of his own 🔥#cricket #india #ruturajgaikwad #ruturaj #sports #sportsnews #cricket #cricketnews #cricketupdate #vijayhazaretrophy pic.twitter.com/9d49q5nhs0
— KhelBaaz (@khel_baaz) November 28, 2022