భారత్-వెస్టిండీస్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా జరిగన రెండో వన్డేలో రోహిత్ శర్మ టీమిండియా స్పిన్నర్ చాహల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డ్ సెట్ చేస్తూ.. ‘ఏమైంది నీకు.. సరిగ్గా ఉరకడం లేదు ఎందుకు? చల్ అక్కడికి పరిగెత్తు’ అంటూ కేకలు వేశాడు. రోహిత్ మాటలు మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇప్పడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మైదానంలో ఉన్న సమయంలో రోహిత్ శర్మ చాలా సీరియస్‌గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ అవ్వడంతో ఫీల్డర్లను ఉత్సహాపరిచేందుకు అలా అని ఉంటాడని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంటున్నారు. మరి రోహిత్ ఆగ్రహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Me to my buddies in Gully Cricket when they get tired after 2 overs of Fielding 😂😂👌 pic.twitter.com/NDIuNWRPY4
— Shantanu Ghosh (@imshantanu105) February 9, 2022