మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన భారత్ 574 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అప్పటికే భారత్ 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఫీల్డింగ్‌కు దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ మిగతా ఆటగాళ్లతో గ్రౌండ్‌లోకి వచ్చాడు.
కానీ వెంటనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్‌ను వెనక్కి పిలిచి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాల్సిందిగా కోరాడు. కోహ్లీ షాక్‌కి గురవుతునే.. రోహిత్ చెప్పినట్లు బౌండరీలైన్ అవతలికి వెళ్లాడు. అనంతరం మిగతా ఆటగాళ్లంతా చకచకా రెండు వైపుల వరుసగా నిల్చుని విరాట్ కోహ్లీకి గ్రౌండ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ వందో టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ ఈ విధంగా ప్లాన్ చేశాడు. దీంతో స్టేడియం అంతా హర్షధ్వానాలతో మారుమోగింది.
ఇక ఆటగాళ్లు ఇచ్చిన గౌరవాన్ని ఆనందంగా స్వీకరిస్తూ.. విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి పరుగు తీశాడు. ఇలా విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మకమైన వందో టెస్టు మరింత స్పెషల్ చేసిన రోహిత్ శర్మపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. విరాట్‌పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడని రోహిత్‌పై క్రికెట్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరి రోహిత్‌శర్మ విరాట్ కోహ్లీకి ఇచ్చిన సర్‌ప్రైజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma asking Virat Kohli to come again as we can have a guard of Honor for his 100th Test – this is amazing. pic.twitter.com/Mv20rNxthl
— Johns. (@CricCrazyJohns) March 5, 2022
Heart-winning gesture from the members of Team India!
They give a ‘Guard of Honor’ to Virat Kohli as he takes the field on his Landmark Test!#INDvSL #ViratKohli #Jaddu #RAVINDRAJADEJA #RahulDravid #Rohit pic.twitter.com/hQ3GfWrdr7— OneCricket (@OneCricketApp) March 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
