కింగ్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగబోతున్నాడా? 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది! ‘కోహ్లీ.. నువ్వు చేసిన పని తప్పు! వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకో’ అంటూ ఇండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ ఎందుకు షాకింగ్ కామెంట్స్ చేశారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేసి తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ ఫామ్, ఈ ఫిట్‌నెస్ చూసిన తర్వాతే కపిల్ దేవ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. కోహ్లీని ఈ వయసులో ఇలా ఆడుతుంటే చూస్తుంటే ముచ్చటేస్తోంది. 37 ఏళ్ల వయసులో కూడా అతడి ఫిట్‌నెస్ అద్భుతం. మరో రెండేళ్లు లేదా మూడేళ్లు సునాయాసంగా టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం కోహ్లీకి ఉంది. అలాంటి ఆటగాడు టెస్టు రిటైర్మెంట్ ప్రకటించడం నన్ను ఎంతగానో బాధించింది’ అని కపిల్ దేవ్ అన్నారు.

అంతేకాదు, కోహ్లీ భవిష్యత్తు గురించి మాట్లాడుతు.. ‘కొన్నేళ్ల తర్వాత కోహ్లీ కచ్చితంగా ఆలోచనలో పడతాడు. అయ్యో! నేను ఇంకొన్నాళ్లు టెస్టు క్రికెట్ ఆడి ఉంటే బాగుండేదే అని పశ్చాత్తాపపడే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్ పట్ల ప్రాణం, అంకితభావం ఉన్నప్పుడు, శరీరం సహకరిస్తున్నప్పుడు టెస్టుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని.. టీ20 వేరు, కానీ టెస్టు క్రికెట్ కోహ్లీకి బాగా సరిపోతుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
అయితే, కపిల్ దేవ్ ఒక మాజీ క్రికెటర్‌గా, ఒక ఫ్యాన్‌గా తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. ‘క్రికెట్‌లో కోహ్లీ ఇప్పుడు తాత లాంటివాడు. అతడికి ఏం చేయాలో చెప్పే హక్కు మాకు లేదు. నిర్ణయం అనేది పూర్తిగా తనదే. కానీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే అభిమానులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’ అని ముగించారు.”
