భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. బరిలోకి దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. ఈ మద్య కొంత మంది స్టార్ క్రికెటర్లు తమ పెళ్లిరోజు, పుట్టిన రోజు సందర్భంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ.. మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా దంపతులు తమ కూతురు ఐదవ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో గొప్ప పని చేసి తమ మంచితనం చాటుకున్నారు. తమ పాప పుట్టిన రోజు సందర్భంగా పేదరికంతో ఇబ్బందు పడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నంగా.. నిరుపేద బాలికల సంక్షేమం కోసం ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు.
101 పేద బాలికలకు సుకన్య సమృద్ది ఖాతాలను జూమ్ నగర్ పోస్టాఫీస్ లో ఖాతా తెరిచారు. మొదటి దఫాగా రూ.11000 జమ చేశారు. ఆ డబ్బు బాలికలకు యుక్త వయసు వచ్చిన తర్వాత తమ ఖాతాల్లో రెట్టింపు అయి జమ అవుతాయి. ఆ సమయంలో వారి చదువు, వివాహానికి ఉపయోగ పడుతుందని జడేజా దంపతులు అంటున్నారు. అయితే భవిష్యత్ లో కూడా ఈ దంపతులు ఖాతాల్లో మళ్లీ డబ్బులు జమ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి జడేజా దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జడేజా భార్య రివాబా జడేజా తన కుమార్తె కున్వరీబాశ్రీ నిధ్యానబా 5వ పుట్టినరోజు సందర్భంగా పోస్టాఫీసు వద్ద లబ్ధిదారులైన కుటుంబాలకు పత్రాలు అందిస్తూ ఆనందంగా కనిపించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు జడేజా దంపతులకు ఇదేం కొత్త కాదని అంటున్నారు. గత సంవత్సరం తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా పేదరికంలో ఉన్న కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందట రివాబా.
ఇలాంటి సేవా కార్యక్రమాలు జడేజా దంపతులకు ఇదేం కొత్త కాదని అంటున్నారు. గత సంవత్సరం తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా పేదరికంలో ఉన్న కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందట రివాబా. కొంత మంది అమ్మాయిలకు ఖాతా తెరిచి ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేసిందట. తాము చేస్తున్న పనిలో ఎంతో తృప్తి ఉందని అంటున్నారు జడేజా దంపతులు. దేశ వ్యాప్తంగా పదివేల మంది నిరుపేదలైన అమ్మాయిలకు తమ వంతు సహాయం అందించాలని.. ఒక్కో కుటుంబానికి పదివేల చోప్పన సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక జడేజా దంపతులు చేసిన గొప్ప పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
pic.twitter.com/RFDUGnPrI9
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022
pic.twitter.com/z40PmmdLa9
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022