వెస్టిండీస్ జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి రాకపోయినా తన ఫీల్డింగ్ స్కిల్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. నమ్మశక్యం కానీ రీతిలో పట్టిన ఒక క్యాచ్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
విరాట్ కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్ బాగా చేస్తాడనుకుంటే పొరపాటే అవుతుంది. ఫీల్డింగ్ లో కూడా విరాట్ తన సత్తా చూపిస్తాడు. వికెట్ల మధ్య పరిగెత్తడం దగ్గర నుంచి క్యాచులు అందుకోవడం వరకు కోహ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత ఫిట్ నెస్ కలిగిన క్రికెటర్లలో కోహ్లీ ఫీల్డింగ్ లో తన విన్యాసాలతో అబ్బురపరుస్తాడు. ఇప్పటివరకు ఎన్నో క్యాచులను, రనౌట్ లను కోహ్లీ దగ్గర నుంచి మనం చాలానే చూసాం. మ్యాచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కోహ్లీ ఎంతో షార్ప్ గా ఉండే కోహ్లీ తాజాగా విండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచులో పట్టిన ఒక క్యాచ్ అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. నమ్మశక్యం కానీ రీతిలో పుట్టిన ఈ క్యాచ్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
వెస్టిండీస్ జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి రాకపోయినా తన ఫీల్డింగ్ స్కిల్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. మొదట బ్యాటింగ్ చేస్తున్న విండీస్ జట్టు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 18 ఓవర్లో జడేజా బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్లో మూడో బంతిని విండీస్ ఆల్‌రౌండర్ రొమేరియో షెఫర్డ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఆ బంతి ఎడ్జ్ తీసుకుని కుడి వైపు స్లిప్‌లో ఉన్న కోహ్లీ వైపుకి వెళ్ళింది. అయితే ఎంతో షార్ప్ గా ఉండే కోహ్లీ ఈ క్యాచ్ ని సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అనంతరం గిల్ నోరెళ్లబెట్టాడు. ఇక బ్యాటర్ షెఫర్డ్ (0) అయితే కాసేపు షాక్ లో ఉన్నాడు. అదే ఓవర్లో పావెల్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టు ఈ వికెట్ తో మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం కోహ్లీ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా స్పిన్నర్లు విజ్రంభించడంతో విండీస్ జట్టు 23 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాప్ హోప్ 43 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ 4, జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. పేసర్లు ముఖేష్ కుమార్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యకి తలో ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్(52) మాత్రం హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి విరాట్ పట్టిన గ్రేట్ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm
— FanCode (@FanCode) July 27, 2023