అంపైర్ల అలసత్వం కారణంగా క్రికెట్లో ఘోర తప్పిదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా అంపైర్ అలర్ట్‌గా లేకపోవడంతో బౌలర్ ఒక ఓవర్లో ఏకంగా 7 కరెక్ట్ బంతులను వేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా, పాకిస్థాన్ మహిళల జట్లు మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్లో పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్ చివరి బంతికి సఫారీ బ్యాటర్ సునే లూస్ ఎల్బీగా ఔటైంది. ఇక అంపైర్ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన సునే లూస్.. ఫలితాన్ని రాబట్టింది. తన నిర్ణయం తప్పుగా తేలడంతో కొంత గందరగోళానికి గురైన ఫీల్డ్ అంపైర్.. బౌలర్ వేసిన బంతుల సంఖ్యను మరిచిపోయాడు.
దాంతో మరో బంతిని వేయించాడు. అదనపు బంతికి సౌతాఫ్రికా సింగిల్ తీసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అంపైర్ ఇలా ఘోర తప్పిదంపై చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఇలాంటి తప్పిదాలు చేస్తే ఎలా? అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన స్కోర్ కార్డ్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Omaima Sohail bowled 7-ball over due to umpire’s miscalculation https://t.co/S0lreAQWaN
— Suhiel ahemead (@ahmedsuhiel1) March 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.