అంపైర్ల అలసత్వం కారణంగా క్రికెట్‌లో ఘోర తప్పిదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా అంపైర్ అలర్ట్‌గా లేకపోవడంతో బౌలర్ ఒక ఓవర్‌లో ఏకంగా 7 కరెక్ట్ బంతులను వేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా, పాకిస్థాన్ మహిళల జట్లు మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్ చివరి బంతికి సఫారీ బ్యాటర్ సునే […]